Your Name : Your Email :

Health problem :

Monday, June 1, 2015

failure in sex,రతిలో వైఫల్యం

  •  

Q : నాకు పెళ్లయి రెండేళ్లయ్యింది. ఇద్దరం ఉద్యోగాలు చేస్తు న్నాం. గర్భం దాల్చాలంటే నిర్దిష్టమయిన రోజుల్లోనే సెక్స్ చేయాలని మా ఆవిడ ఎక్కడో చదివింది. ఆ ప్రకారంగా ఆయా రోజుల్లో సెక్స్ చేయడానికి ప్రయత్నించినపుడు నేను సరిగ్గా చేయలేకపోయాను. రతిలో వైఫల్యం కారణంగా నా కు మనశ్శాంతి లేకుండా పోయింది. నేను సెక్స్‌కు పనికి రానేమోనన్న భయం ఏర్పడింది. ఈ విషయం ధ్రువీకరిం చుకోడానికి నేను బయట ఒక వేశ్యతో కలిసాను. ఫలి తంగా నాకు గనేరియా సోకింది. డాక్టర్ గారు నాకు మం దులిచ్చి రెండు నెలలు పాటు వాడమని చెప్పారు. అంతే కా కుండా, మందులు వాడుతున్న రోజుల్లో, భార్యతో సెక్స్ చే యవద్దని సూచించారు. అందువల్ల ఆమెకు కూడా వ్యాధి సంక్రమించే ప్రమాదం ఉందని చెప్పారు. ఇదంతా నేను నా భార్యకు చెపకోలేని పరిస్థితి. పిల్లలు కావాలనుకుంటు న్నప్పట్నుంచి, నేను సెక్స్ పట్ల సరిగ్గా ప్రవర్తించలేకపోవడం వల్ల ఆమె నన్ను అపార్ధం చేసుకుంటోంది. ఈ పరిస్థితుల్లో నేనేం చేయాలి?


Ans : కొంతమందిలో తప్పనిసరిగా సెక్స్ చేయాలనే నిబంధన ఉన్నపుడు సహజంగా రతిలో వైఫల్యం చెందడం జరుగు తుంది. ఈ కారణంగా సెక్స్‌కు పనికిరాననే అభిప్రాయానికి రావడం మీరు చేసిన మొదటి తప్పయితే, ఆ విషయాన్ని ధ్రువీకరించుకోవడానికి మీరంతట మీరే ప్రయత్నించడం, వేశ్య దగ్గరకు వెళ్లడం మరో తప్పు! ప్రస్తుతం ఇదంతా మీ భార్యకు చెప్పకపోవడం మీరు చేస్తున్న మూడో తప్పు. మీ భార్య మిమ్మల్ని అర్ధం చేసుకోదేమోనన్న భయం మీకు ఉం డడం నిజమే కానీ అందువల్ల మీ ఇద్దరి మధ్య అన్యోన్యత దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతున్నపుడు, మీరు తాత్సారం చేయడం మంచిది కాదు. మీ భార్యకు వెంటనే జరిగిందంతా చెప్పండి. మీరిలా ఎందుకు చేయాల్సివచ్చిందో ఆమెకు వివ రించండి. కావాలని మీరు చేసిన తప కాదు కాబట్టి ఆమె అర్థం చేసుకుంటుంది. అయినా సరే మీ భార్య మిమ్మల్ని అర్థం చేసుకోదేమోనన్న అనుమానం ఉంటే, మీ దగ్గర్లో వున్న సెక్స్ కౌన్సిలర్‌ను కలవండి.

  • * ================================= *
 Visit my website : Dr.Seshagirirao.com _

Saturday, May 9, 2015

can we get aids from blood transfusion of HIV negative? ,హెచ్.ఐ.వి లేని డోనార్ నుండి ఎయిడ్స్ ఎలా?


  •  
ప్ర : నా భార్యకి కాన్పు  సమయము లో అధికము గా రక్తస్రావము అయినది , అత్యవసరముగా రక్తం ఎక్కించారు . రక్తము ఎక్కించేముందు ఆ రక్తాన్ని ఎయిడ్స్ తో సహా అన్ని పరీక్షలూ చేసారు. అయినప్పటికీ ఆవిడకు ఎయిడ్స్ వచ్చింది. ఇది ఎలా సాధ్యము ? మా అవిడ శీలాన్ని శంకించలేను. నేను కూడా ఫర్ ఫెక్ట్ . అటువంటప్పుడు ఇదెలా జరిగింది?.

జ : మామూలు రక్త పరీక్షల్లో హెచ్.ఐ.వి ఉన్నట్లు తెలియడానికి మూడు నెలలు పడుతుంది. ఎవరైనా హెచ్ ఐ.వి ఉన్న పరాయి వ్యక్తులతో సెక్స్ లో పాల్గొని ఈ మూడునెలల లోపల రక్తదానము చేస్తే ఆ వ్యాధి సంక్రమిస్తుంది. మూడు నెలల వరకూ ఆ వ్యక్తిలో హెచ్.ఐ.వి  ఉన్నట్లు మామూలు టెస్టుల్లో ల్లో తెలీదు. ఇప్పుడు మీ భార్యకు రక్తదానము చేసిన వ్యక్తిని పరీక్ష చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తిలో హెచ్.ఐ.వి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.

ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కనుకనే  రక్తదానము చేసే వ్యక్తులు అపరిచిత సెక్స్ లో పాల్గొంటే  3 నెలల లోపు  రక్తదానము చేయకూడదు.

* ================================= *
Visit my website : Dr.Seshagirirao.com _

Friday, September 19, 2014

శరీరాకృతి తనకు నచ్చినట్టుగా లేదని అంటున్నారు

ప్రశ్న: మా వారికి యాభై అయిదేళ్లు. రతిలో యాక్టివ్‌గానే ఉం టారు. కాని ఇటీవల నా శరీరాకృతి తనకు నచ్చినట్టుగా లేదని అం టున్నారు. ఈ కారణం చేత రతిలో పటిష్టమయిన ఉద్రేకాన్ని పొంద లేకపోతున్నానని చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు నేను స్లిమ్‌గా అవ్వా లంటే ఎలా... చెబితే వినడం లేదు. పైగా బయటకు పోతానని బెదిరింపు ఒకటి. వయసులో వున్నట్టుగా ఆకర్షణీయంగా వుండాలంటే ఆవుతుందా ఈయనకు ఎవరితోనయినా చెప్పిస్తే మంచి దనిపిస్తోంది. మీ సలహా ఏమిటి.

జవాబు:
వయసు పైబడిన కొద్ది లైంగికోద్రేకస్థాయి కూడా తగ్గి పోతుంది. ఆయనకు యాభై దాటాయి కాబట్టి సహజంగానే హర్మోనుల ఉత్పత్తి పడిపోతుంది. ఐతే లైంగిక జీవితం పట్ల ఇష్టత కార ణంగా రతిలో పాల్గొనడం జరుగుతుంది. ఇలా గడపగలగడం కూడా అదృష్టంగా భావించాలి. ఆయన కోరుకున్నట్లుగా స్లిమ్‌గా తయారు కావడం మీ దాంపత్య జీవితానికే కాదు, మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎత్తుకు తగిన లావును మెయింటేన్‌ చేయడం, ప్రతి రోజూ వ్యాయాయం చేయడం, ఆహారంలో జాగ్రత్తలను పాటించటం ద్వారా మీరు నిత్య యవ్వనులుగా వుండవచ్చు. ఫలితంగా మీ ఇద్దరి నడుమ ఆకర్షణ ఏ మాత్రం ప్రభావితం కాదు. ఇద్దరికి సెక్స పట్ల ఆసక్తిగా వుంది కాబట్టి, వయసులో వున్నప్పటి ఆకర్షణ కూడా సుసాధ్యమే అని గ్రహించండి. ఇక బయటకు పోతానని చేసే ఆయన బెదిరింపులను పట్టించుకోకండి. ఆ అవకాశం లేనే లేదు... ఉన్నా అవతల వారికి సంతృప్తి చేయగల capacity ఆ వయసువారికి ఉండడము చాలా అరుదు. 

మీ విషయము లో సన్నబడదానికి  కొన్ని మందులు ఉన్నాయి. వాడండి. 1. cap Reshape Natural .. daily 2 caps ఉదయము ,- రాత్రి వాడండి . 2 Cap. BGR 34 రోజుకి 2 ... ఉదయము - రాత్రి . దీనికి తోడు  థైరాయిడ్ మాత్రలు Tab. Eltroxine 100 mcg రోజూ ఒకటి ఉదయం పరగడుపున వాడండి.

  • ================================
Visit my website : dr.seshagirirao.com

స్వైర కల్పనలు లేదా ఫాంటసీలు లైంగిక క్రియలను మరింత ఉత్తేజభరితంగా మలుస్తాయి

ప్రశ్న: నేను మైధున సమయంలో అపుడపుడు స్వైర కల్పనలను ఆశ్రయిస్తున్నాను. ఇది శారీరకంగా లైంగిక పటుత్వాన్ని తగ్గిస్తుందా... ఇదే అలవాటయిపోయి స్వైర కల్పనలు లేనిదే రతిలో పాల్గొనలేకపోవడం జరుగుతుందా ఎదురుగా భార్యను పెట్టుకుని ఇలా మరో వ్యక్తితో సెక్స చేస్తున్నట్లు ఉహించుకోవడం తప్పుకాదా ?.

జవాబు: స్వైర కల్పనలు లేదా ఫాంటసీలు లైంగిక క్రియలను మరింత ఉత్తేజభరితంగా మలుస్తాయి. ఇవి స్త్రీలలోను,పురుషులలోను లైంగికోద్రేకభావాలను పెంచి, యోనిలో అధిక స్రావాలు ఏర్పడడానికి, అంగజం కలగడానికి తోడ్పడతాయి. పురుషుల్లో అయితే అంగస్తంభనను పెంచుతాయి. ఫాంటసీలు ఎవరికి వారు తమ ఇష్టాన్ని బట్టి ఏర్పరచుకునేవి. కాబట్టి వాటిని రహస్యంగానే ఉంచుకోవడం జరుగుతుంది. అవగాహన వున్న దంపతులు తమ తమ లైంగిక స్వైర కల్పనలను పరస్పరం పంచుకోవచ్చు. అందువల్ల వారి దాంపత్య జీవితం మరింత ఉత్కంఠభరితమవుతుంది. కొంతమందిలో అవగాహనా లోపం చేత ఫాంటసీలను తప్పుగా భావించడం జరుగుతుంది. ఇవికేవలం ఊహలే తప్ప చేతలు కావు కాబట్టి వీటికి అంత ప్రాధాన్యత నివ్వాల్సిన పనిలేదు. ఫాంటసీలలో పలు రకాలయిన కథావస్తువుల్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా వైయుక్తిక లైంగికాభిరుచుల్ని బట్టి ఆధారపడి వుంటాయి. స్వైర కల్పనలో కథావస్తువును ఆధారంగా చేసుకుని దంపతులు పరస్పర వ్యక్తిత్వ లక్షణాలకు వీటిని ఆపాదించి చూడనంతకాలం వీటి వల్ల ప్రమాదమేమీ లేదు. ఐతే కొంతమందిలో ఈ ఉహలను ఆధారంగా చేసుకొని అవతలి వ్యక్తిని అపార్థం చేసుకునే అవకాశం వుంది. అటువంటి సందర్భాలలో ఆయా స్వైరకల్పనలే కావాలనుకుంటే రహస్యం తప్పదు. లేదా అందుకు ప్రత్యామ్నాయంగా ఎదుటివ్యక్తికి సైతం నొప్పి కలిగించని వస్తువుల్ని ఎంచుకోవడం తప్ప మార్గం లేదు. స్వైర కల్పనల కారణంగా లైంగిక పటుత్వం తగ్గిపోతుందని ఎక్కడా లేదు. ఇవి ఒక అలవాటుగా మారిపోయే అవకాశం కూడా లేదు. దంపతుల నడుమ లైంగిక జీవితాన్ని మరింత మధురంగా వుండేలా చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయే తప్ప ఇందువల్ల శారీరకంగాను కాని,మానసికంగా కాని లైంగికత్వం ప్రభావితం కాదు.
  • ============================
Visit website : dr.seshagirirao.com

ట్రైగ్లిజరైడ్స్‌.. అదుపు ఎలా?, How to controle TriglyceridesQ : నా వయసు 64 సంవత్సరాలు. ఇటీవల ట్రైగ్లిజరైడ్స్‌ పరీక్ష చేయిస్తే 186 ఎంజీ/డీఎల్‌గా వచ్చింది. వీటిని అదుపులో ఉంచుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించండి.

A : మామూలుగా ట్రైగ్లిజరైడ్స్‌ 200 వరకూ ఉన్నా ఫర్వాలేదు. అయితే.. అధిక రక్తపోటు, మధుమేహం, కుటుంబంలో గుండె జబ్బుల వంటివి ఉంటే ట్రైగ్లిజరైడ్స్‌ను 100 లోపలే ఉంచుకోవటం చాలా మంచిది. దీనివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, దుష్ప్రభావాలు తగ్గుతాయి. మామూలుగా కొలెస్ట్రాల్‌ అనేది మన రక్తంలో ఉండే ఒక రకం కొవ్వు. ఇది చాలావరకూ మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్‌ కూడా రక్తంలో ఉండే కొవ్వేగానీ.. ఇది వ్యాయామానికి సంబంధించినది. ట్రైగ్లిజరైడ్స్‌ పెరగటం గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి దీనిని నియంత్రించటానికి మందులతో చికిత్స తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తాయి. చికిత్స, వ్యాయామం రెండూ అవసరం.


  • =============================================