Your Name : Your Email :

Health problem :

Saturday, October 8, 2011

కలయిక అసౌకర్యంగా అనిపిస్తోంది నాలో లోపమేదైనా ఉందంటారా?

Q : ఏడాది క్రితం మా పెళ్లయ్యింది. ఇద్దరం ఉద్యోగులమే. ఇతర విషయాల్లో ఎంతో అన్యోన్యంగా ఉండే మాకు అప్పుడప్పుడు కలయిక అసౌకర్యంగా అనిపిస్తోంది. ఫలితంగా ఇద్దరిలోనూ తీవ్రమైన అసంతృప్తి. లోపం నాలోనే ఉందంటున్నారాయన. అదే విషయాన్ని స్నేహితురాలితో చర్చిస్తే లైంగికాసక్తిని పెంచుకునేందుకు రకరకాల మార్గాలని సూచించింది. అవి ఫలిస్తాయా. నాలో లోపమేదైనా ఉందంటారా?--- ఓ సోదరి

A : మీలో ఎలాంటి లోపం లేదు. అలాగే మీ స్నేహితురాలు చేసిన సూచనలూ సరైనవే. కలయిక అసౌకర్యాన్ని కలిగిస్తోందంటే.. లైంగిక జీవితానికి సంబంధించిన కొన్నిరకాల ఆలోచనలు ఇద్దరిలో ఉండటం.. వాటిని ఎదుటి వారికి తెలియజేయలేకపోవడం కారణం కావచ్చు. కాబట్టి భాగస్వామి నుంచి మీరేం కోరుకుంటున్నారో స్పష్టంగా వివరించే ప్రయత్నం చేయండి. అలాగే ఆయనా మీ నుంచి ఏం ఆశిస్తున్నారో అడిగి తెలుసుకోండి. అప్పుడే కలయికను ఇద్దరూ ఆనందించగలుగుతారు. ఒకరినొకరు మాటలతో ప్రేరేపించుకోవడం వల్ల లైంగికాసక్తి పెరుగుతుందనేది వాస్తవమే. ఉద్యోగస్తులంటున్నారు కాబట్టి ఇద్దరూ ఎక్కువ సమయం కలిసి ఉండేలా చూసుకోండి. అభిరుచుల్ని గౌరవించుకోవడం, ప్రతి ఆర్నెల్లకోసారి ఒకటి రెండు రోజులైనా సరే కలిసి విహారయాత్రలు చేయడం వల్ల ఇద్దరిమధ్యా దగ్గరితనం పెరుగుతుంది. ఇద్దరిలో ఉన్న చిన్నచిన్న అసంతృప్తులూ తొలగిపోతాయి. ఎటువంటి సంకోచాలు లేకుండా మనసు విప్పి మాట్లాడుకోవడం అన్నది అన్నిటికన్నా ముఖ్యమని గ్రహించండి.

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail