Your Name : Your Email :

Health problem :

Wednesday, October 26, 2011

పిల్లలకు ఎలా నచ్చజెప్పాలి?,How to convince the Children?


Q : మా పాప ఇంజినీరింగ్‌ చదువుతోం ది. మా చెల్లెలి కూతురు కూడా మా ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. చదువు బాగానే చదువుకుంటారు. కానీ అనుకోకుండా ఒక రోజు రాత్రి కిటికీలోనుంచి వాళ్ల భాగోతం చూసి ఆశ్చర్యపోయాము. ఇద్దరూ సిగిరెట్లు తాగుతూ... టివిలో వచ్చే నీలి చిత్రాలు చూస్తున్నారు. అది చూసి నేను అవాక్కయ్యాను. గారంగా పెంచాము వాళ్లను. ఇప్పుడు ఇలా దిగజారిపోతారని అనుకోలేదు. ఈ విషయంలో వారిని సరిదిద్దుకోమని ఎలా చెప్పాలి. తెలియజేయగలరు.

A : నేటి ఆధునిక జీవనశైలి... లక్షల్లో జీతాలు... పబ్‌ కల్చర్‌... ఇంటర్‌ నెట్‌లో నీలి చిత్రాలు ఇవన్నీ పిల్లల్ని పక్కదారి పట్టిస్తున్నాయి. ముందుగా వీటికి దూరంగా పిల్లల్ని ఉంచాలి. ఇంట్లో తల్లిదండ్రులు ఎంత విలువలతో... ఆశలతో పెంచినా సమాజ ప్రభావం, స్నేహితుల ప్రభావం తప్పకుండా ఉంటుంది. తల్లిదం డ్రులు నిరంతరం పిల్లల్ని... వారి పోకడలు... ప్రవర్తనలు... అలవా ట్లలో మార్పుల్ని గమనిస్తూ ఎప్పటి కప్పుడు సరిచేసుకుంటూ ఉండా లి. వాళ్లు జీవితంలో నిలదొక్కుకు నేదాకా ఇది తప్పదు. ఈ విషయం లో సంయమనం పాటించండి. వాళ్లకు ముందు కౌన్సిలింగ్‌ చేయించేందుకు దగ్గరలో ఉన్న డాక్టర్‌ వద్దకు తీసుకువెళ్లండి.


=============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail