Your Name : Your Email :

Health problem :

Thursday, November 22, 2012

మా వారికి కోర్కెలెక్కువ.. నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి?


Q : మా వారికి కోర్కెలెక్కువ.. నాకు ఇష్టం లేదు.. ఏం చేయాలి?

A : చాలా మందికి వయస్సు మీద పడుతున్నప్పటికీ.. శృంగార కోర్కెలు మాత్రం ఏమాత్రం తగ్గవు. ఒకవైపు భార్య అనాసక్తత ప్రదర్శిస్తున్నప్పటికీ.. భర్త మాత్రం మంకుపట్టుతో వ్యవహరిస్తూ సెక్స్ చేసేందుకు ఆసక్తి చూపుతుంటాడు. ఆడవారిలో పూర్తిగా సెక్స్ కోర్కెలు లేని సమయంలో ఇలాంటి సమస్య ఉత్పన్నమవుతుంది. దీంతో మహిళలు ఆందోళన చెదుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆసక్తి పెరిగేందుకు ఏవైనా మందుల కోసం వైద్యులను సంప్రదిస్తుంటారు.

సాధారణంగా వయస్సు మీద పడిన తర్వాత లేదా అండాశయాలను తొలగించడం వల్ల వాటి నుంచి శరీరానికి, లైంగిక అవయవాల ఆరోగ్యానికి కావలసిన స్త్రీ హార్మోన్లు విడుదల కావని చెపుతున్నారు. దీంతో సెక్స్‌ పట్ల కొద్ది ఆసక్తి తగ్గుతుందంటున్నారు. హార్మోన్ల లోపం వల్ల యోని నాళపు కండరాలలో తడి తగ్గిపోయి అక్కడ పొడారి కలయిక మంటగా, నొప్పిగా ఉండటం వల్ల కూడా శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుంది . సెక్స్ కోరికలు పెంచే మందులు వాడడం అంత మంచిది కాదు . కారణాన్ని బట్టి మందులు వాడాలి.
*హార్మోనుల థెరఫీ (ఈస్ట్రోజన్‌+ప్రొజిస్ట్రోన్‌ ) డాక్టర్ సలహా మేరకే వాడాలి ,
*యోని పొడిగా ఉంటే .. వెజైనల్ జెల్ గాని , వేజలైన్‌ గాని , కాడిడ్ -బి  ఆయింట్ మెంట్ గాని స్త్రీ ,పురుషు అంగాలకు రాసి సెక్ష్ కు ఉపక్రమించాలి.
* భర్తకోసం భార్య , భార్యకోసం భర్త మరియు ఇద్దరి సుఖము కోసము  ఒకరినొకరు సహకరించుకోవాలి . సుఖజీవవానికి సెక్ష్ ఒక్కటే మార్గము కాదు .

=======================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail