Your Name : Your Email :

Health problem :

Saturday, May 9, 2015

can we get aids from blood transfusion of HIV negative? ,హెచ్.ఐ.వి లేని డోనార్ నుండి ఎయిడ్స్ ఎలా?


  •  
ప్ర : నా భార్యకి కాన్పు  సమయము లో అధికము గా రక్తస్రావము అయినది , అత్యవసరముగా రక్తం ఎక్కించారు . రక్తము ఎక్కించేముందు ఆ రక్తాన్ని ఎయిడ్స్ తో సహా అన్ని పరీక్షలూ చేసారు. అయినప్పటికీ ఆవిడకు ఎయిడ్స్ వచ్చింది. ఇది ఎలా సాధ్యము ? మా అవిడ శీలాన్ని శంకించలేను. నేను కూడా ఫర్ ఫెక్ట్ . అటువంటప్పుడు ఇదెలా జరిగింది?.

జ : మామూలు రక్త పరీక్షల్లో హెచ్.ఐ.వి ఉన్నట్లు తెలియడానికి మూడు నెలలు పడుతుంది. ఎవరైనా హెచ్ ఐ.వి ఉన్న పరాయి వ్యక్తులతో సెక్స్ లో పాల్గొని ఈ మూడునెలల లోపల రక్తదానము చేస్తే ఆ వ్యాధి సంక్రమిస్తుంది. మూడు నెలల వరకూ ఆ వ్యక్తిలో హెచ్.ఐ.వి  ఉన్నట్లు మామూలు టెస్టుల్లో ల్లో తెలీదు. ఇప్పుడు మీ భార్యకు రక్తదానము చేసిన వ్యక్తిని పరీక్ష చేసినట్లయితే తప్పకుండా ఆ వ్యక్తిలో హెచ్.ఐ.వి ఉన్నట్లు నిర్ధారణ అవుతుంది.

ఇటువంటి ప్రమాదాలు ఉంటాయి కనుకనే  రక్తదానము చేసే వ్యక్తులు అపరిచిత సెక్స్ లో పాల్గొంటే  3 నెలల లోపు  రక్తదానము చేయకూడదు.

* ================================= *
Visit my website : Dr.Seshagirirao.com _

1 comment:

  1. Na age 21nenu ok ammayini deep ga premisthunnanumemu iddaram sex cheyalanu kuntunnam.kani sex tharvatha pregnent avuthundani bhayam.memu ela kalavali?

    ReplyDelete

Ask your health Question? with your e-mail