Your Name : Your Email :

Health problem :

Wednesday, October 12, 2011

స్తనాలు పరిమాణము తగ్గడము ఎలా?

ప్రశ్న: నేను డిగ్రీ చదువుతున్నాను. నా స్థనాలతో నేను ఎక్కువ సమ స్యకు గురవుతున్నాను. అవి నార్మల్‌ కన్నా ఎక్కువస్థాయిలో వున్నాయి. ఇందువల్ల బయటకు వెళ్లాలంటే సిగ్గుగా వుంటోంది. ఎంత గట్టిగా వెనక్కి పెట్టుకుని దుస్తులు ధరించినా మరీ పెద్దవికావడం వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందరూ ఇలా చూడడం నాకు చాలా ఇబ్బందిగా వుంటోంది. స్తనాలు పెరగటానికి మార్గాలున్నాయని చదివాను. అలాగే పెరిగిన స్తనాలను తగ్గించుకోవడానికి ఏమయినా మార్గం వుందా - స్రవంతి... ఇచ్ఛాపురం.

జవాబు: స్తనాలు పెద్దవిగా వుండడం ఒక టీనేజి యువతికి గర్వకారణంగా తోచే అంశం. ఈ విషయంలో నువు వర్రీ అవుతున్నావంటే నీ స్తనాలు మరీ పెద్దవి కావడం కారణం అయి వుండాలి. లేదా అందరూ చూడడం వల్ల అవి నిజంగానే చాలా చాలా పెద్దవి అనే అభిప్రాయానికి నువు వచ్చి వుండాలి. స్తనాల సైజులో నార్మల్‌ సైజు ప్రసక్తి లేదు. కొంతమందిలో ఇవి చిన్నవిగా వుంటే, మరికొందరిలో పెద్దవిగా ఏర్పడతాయి. వయసును బట్టి, స్తనాలలో చేరుకునే స్పాంజివంటి కొవ్వు కణాలను బట్టి సైజు ఆధారపడి వుంటుంది. నీ బరువు, ఎత్తు ఇందుకు తగిన విధంగా లేకపోవడం వల్ల కూడా స్తనాలు మరీ ఎత్తుగా వున్నట్టు కన్పించవచ్చు. కాబట్టి నీ స్తనాలు అతిగా వున్నాయని నువ్వే నిర్దారించలేవు. సంబంధిత వైద్యులు మాత్రమే చెప్పగలరు. అవసరమయితే శస్త్ర చికిత్స ద్వారా నీ సమస్యను పరిష్కరిస్తారు.

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail