Your Name : Your Email :

Health problem :

Saturday, October 15, 2011

చేతి గోళ్ల దగ్గరి చర్మం నల్లగా ఉంది.ఎలా తగ్గించుకోవచ్చు?

Q : నా వయసు ఇరవై ఎనిమిది. చేతి గోళ్ల దగ్గరి చర్మం నల్లగా ఉంది. గోళ్లపైనా గీతలు పడ్డాయి. వేళ్లు ముడతలు పడుతున్నాయి. వాటిని ఎలా తగ్గించుకోవచ్చు. --- ఓ సోదరి

A : గోళ్లదగ్గరి చర్మం నల్లగా ఉందంటే.. యాంటీసెప్టిక్‌ క్రీంలు వాడాలి. వీలైతే వైద్యుల సలహా తప్పనిసరి. నిర్లక్ష్యం చేస్తే గోరుపూర్తిగా వూడిపోయే ప్రమాదం ఉంటుంది. నొప్పి కూడా ఉంటే.. ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇక, గోళ్లు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే.. వారానికి రెండుసార్లు నిమ్మచెక్కతో రుద్దుకోవాలి. చేతుల్ని సాధ్యమైనంత వరకు పొడిగా ఉంచుకుంటే.. ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఇన్‌ఫెక్షన్లనూ దూరం చేసుకోవచ్చు. ముడతలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు కాబట్టి ప్రతిరోజు ఏదైనా ఓ నూనె తీసుకుని మూడునాలుగు నిమిషాలు వేళ్లపై మర్దన చేయండి. ఇంటిపనులన్నీ పూర్తయ్యాక చేతులు, వేళ్లకు మాయిశ్చరైజర్‌ తప్పనిసరిగా రాసుకోండి. ఎట్టిపరిస్థితుల్లోనూ చేతుల్ని పొడిబారనివ్వకూడదు. మీరు తీసుకునే ఆహారంలోనూ బాదం, సోయాపాలు, పెరుగు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. మాంసాహారులైతే కోడిగుడ్డు తప్పనిసరి. విటమిన్‌ సి ఆధారిత పండ్లను తీసుకుంటే గోళ్లు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. గోరువెచ్చని ఆలివ్‌నూనెలో గోళ్లు మునిగేలా ఉంచినా తేమను సంతరించుకుని తాజాగా కనిపిస్తాయి.

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail