Your Name : Your Email :

Health problem :

Tuesday, October 18, 2011

కన్నెపొర చినిగిందో లేదో పరీక్ష చేయించుకోవాలంటే ఏం చేయాలి

ప్రశ్న: నేను ప్రతిరోజూ కాలేజికి సైకిలు మీదే వెళ్లే అలవాటు వుండేది. ఇపుడు నాకు పెళ్లి కాబోతున్నది. సైక్లింగ్‌ ఎక్కువ చేసే ఆడవారిలో కన్నెపొర చినిగిపోతుందని నా స్నేహితులు అంటు న్నారు. ఇది ఎంతవరకు నిజం. ఒకవేళ నాకు కన్నెపొర లేకపోతే నా భర్త నన్ను శంకించడా నా కన్నెపొర చినిగిందో లేదో పరీక్ష చేయించుకోవాలంటే ఏం చేయాలి

జవాబు: సైక్లింగ్‌ ఎక్కువ చేస్తే కన్నెపొర చినిగిపోతుందనేది నిజమే! కాని కన్నెపొర చినిగిపోవడానికి సైక్లింగే కాదు ఇంకేం చేసినా చిని గిపోవచ్చు. స్కిపింగ్‌ ఆడడం, దూకుడుగా మెట్లు దిగడం, జంప్‌ చేయడం, గేమ్స్‌లో పాల్గొనడం ఇలా ఎట్లాంటి శారీరక శ్రమతో కూడుకున్న పనులు ఏం చేసినా కన్నెపొర చినిగిపోయే అవకాశం వుంది. కన్నెపొర యోని ద్వారం వద్ద వుండే ఒక సన్నని పొర మాత్ర మే. ఇది కొంతమందిలో అబ్‌నార్మల్‌గా ఎక్కువ మందాన్ని కలిగి వుంటుంది. అటువంటి వారికి ఎట్లాంటి శారీరక శ్రమతో కూడు కున్న పనులు చేసినప్పటికీ కన్నెపొర చినిగిపోదు. అంతేకాదు అంత మందంగా వున్న వ్యక్తులకు కన్నెపొరను శస్త్ర చికిత్స కూడా చేయిం చాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి కన్నెపొర చినగకుండా వుంటేనే కన్య అని లేకుంటే నువు కన్యవు కావని నీకు కాబోయే భర్త శంకి స్తాడని అనుకోరాదు. ఒకవేళ అతనికి అటువంటి అనుమానమే దయినా వుంటే కన్నెపొర విషయంలో అతనికి అవగాహన కల్పిం చడం ద్వారా సమస్యను సులభంగా పరిష్కరించవచ్చు.

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail