Your Name : Your Email :

Health problem :

Tuesday, October 18, 2011

చనుమొనలు బిగువుగా ఎరెక్టగా వుండడం ఒక సహజమయిన పరిణామం

ప్రశ్న: మా అమ్మాయికి పద్దెనిమిదేళ్లు. ఆమె చను మొనలు ఎప్పుడూ బుడిపెల్లా వుంటున్నాయి. అందువల్ల తనకు చాలా చిరాకుగా వుంటోం దని చెబుతోంది. ఇది పాలుపడ డానికి సంకేతమా అంతే కాకుండా తనకు ఈ మధ్య స్తనాల నడుమ వుండే వలయంలో పొక్కులు వచ్చాయి. అలాగే చంకల్లో కూడా చెమటకాయల్లా వస్తు న్నాయి. ఎవరికి చూపించాలి

జవాబు: ఈ వయసులో చనుమొనలు బిగువుగా ఎరెక్టగా వుండడం ఒక సహజమయిన పరిణామం. అందరికి ఇది ఏర్పడుతుంది. కొం తమందిలో మీ అమ్మాయికి కనిపించినంత ఎక్కువస్థాయిలో కనిపి స్తుంది. సెకండరి సెక్సువల్‌ లక్షణాలకు ఇది నిదర్శనం. కాగా ఇం దువల్ల చికాకు ఏర్పడుతున్నట్టయితే వదులుగా వుండే లోదుస్తులను ఎంపిక చేయండి. పూర్తిగా కాటన్‌ దుస్తులనే వాడండి. అందువల్ల మీరు చెప్పిన చెమటకాయలు వంటి పొక్కులు కూడా పోతాయి. చంకల్లోను, చన్ను మీదా వస్తున్న పొక్కులు దుస్తుల అలర్జి కార ణంగా వచ్చినవి. కాబట్టి దుస్తుల వాడకంలో జాగ్రత్త, శుభ్రత విష యంలో జాగ్రత్త తీసుకుంటే సమస్య పరిష్కారమవుతుంది. అప్పటికి అలర్జీ తగ్గకపోతే మీ అమ్మాయిని చర్మవ్యాధి నిపుణుని దగ్గరకు తీసుకువెళ్లండి.

1 comment:

  1. HI SIR
    SIR NAA MISSES KI ROMMULU PINA చను మొనలు LEVU NAAKU KONCHAM IBBANDI GA VUNDI DAYA CHESI SAMADANAM IVVAGALARU...

    ReplyDelete

Ask your health Question? with your e-mail