Your Name : Your Email :

Health problem :

Wednesday, October 26, 2011

శృంగారం పరమౌషధం , Sex is a magic medicine



ప్ర : శృంగారరమము పరమ ఔషధము అంటారు ఎలాగు ?

జ : జీవితంలో శృంగారం ముఖ్యమైనది. అది శరీరానికి సుఖాన్ని, మానసిక ఆనందాన్ని ఇస్తుంది. శృంగారం లేకుంటే ఎన్ని వున్నా ఏమీలేనట్లే... జీవితం శూన్యంగా తోస్తుంది. శృంగారం ఆలోచనలు మనసును వేధిస్తూ మరో పని చెయ్యనీయకుండా చేస్తాయి. స్వయంతృప్తి లేదా ఇంకొకరితో శృంగారంలో పాల్గొనడం వల్ల మనసులో ఆందోళనలు తొలగిపోతాయి. ఆనందం కలుగుతుంది.మంచి శృంగారం వలన మెదడులో ‘ఎండార్ఫిన్స్‌’ అనే పదార్థాలు విడుదలవుతాయి. వీటిని మెదడే తయారు చేసుకుంటుంది. వీటివల్ల శరీరంలో నొప్పులు తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. మంచి నిద్ర కలుగుతుంది. అందుకే కీళ్ళ నొప్పులు ఉన్నవారు, నిద్ర సరిగా పట్టని వారు రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనాలి.
-ఇది ఇంకా శాస్ర్తీయంగా పరిశీలించబడలేదు. అంతే కాకుండా శరీరంలో కార్టిజోన్స్‌ విడుదల అయి వాపు, నొప్పి తగ్గుతాయని కూడా ప్రఖ్యాత సెక్సాలజిస్ట్‌ డా జాన్‌ బ్యాంకప్ట్‌ గారి ఉద్దేశంలో సెక్స్‌ భార్యాభర్తలు కలిసి జీవించడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. ఆనందాన్నిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచి ఆందోళనను తగ్గిస్తుంది. ఈవిధంగా చేయడంద్వారా సమాజానికికూడా మేలు జరుగుతుంది. ఇవన్నీ ధార్మికమయిన శృంగారం వలనే కలుగుతాయి. భార్యతో శృంగారంలో పాల్గొనడం లేదా స్వయంతృప్తిలోనే కలుగుతాయి. అక్రమసంబంధాలు అనేక అనర్థాలకు దారితీస్తాయి. సుఖవ్యాధుల వ్యాప్తి, ఆందోళనలు, సెక్స్‌ సమస్యలు, సంసారాలు విడిపోవడం జరుగుతాయి. ఎనిమిదవ ప్రపంచ సెక్స్‌ శాస్తజ్ఞ్రుల సభలో సెక్స్‌ వలన కలిగే అనర్థాల గూర్చి ఒక పేపర్‌ చదివారు. చాలా యుద్ధ్దాలకు మూలకారణం అక్రమ సంబంధాలే. కనుక సక్రమమైన, ధార్మికమైన శృంగారం అనేక ఉపయోగాల్ని కలిగించి వ్యక్తికి, సమాజానికి మేలు చేస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
--bruna-abdullah


  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail