Your Name : Your Email :

Health problem :

Monday, October 24, 2011

వృద్ధాప్యము లో విపరీత లైంగిక ఆసక్తులు,Sex perversions in Old age

Q : నా వయసు 65 సంవత్సరాలు. భార్యాబిడ్డలు ఉన్నారు. ప్రస్తుతం భార్యపై లైంగిక ఆసక్తి పోయింది. 16-20 ఏళ్ల కుర్రాళ్లతో మలద్వారంగుండా సెక్సు చేసుకోవాలనే కోరిక తీవ్రంగా వేధిస్తోంది. మగవారిపైనే వ్యామోహం కలుగుతోంది. ఎందుకిలా జరుగుతోంది. తగ్గే మార్గం ఉందా?

A : మీ విషయంలో.. ఇంతకాలంపాటు ఎలాంటి సమస్య లేకుండా ఉండి, ఈ వయసులోనే ఇలాంటి విపరీత లైంగిక ఆసక్తులు పెరుగుతున్నట్లయితే మాత్రం సమస్య ఉన్నట్లుగానే భావించాలి. అయితే.. ఇది మానసిక సమస్యే అని తేల్చే ముందు అన్నివిధాలుగా పరీక్షించాలి. 65 ఏళ్ల తర్వాత మెదడులో కొన్ని భాగాలు డీజనరేషన్‌లో భాగంగా క్షీణించటం మొదలవుతుంది. దీనివల్ల డిమెన్షియా వంటి సమస్యలతో పాటు వ్యక్తిత్వంలో మార్పులు తలెత్తుతుంటాయి. ముఖ్యంగా ఇలాంటి రుగ్మత ఉన్నప్పుడు వ్యక్తిత్వ మార్పులతోపాటు మతిమరపు తదితర సమస్యలూ కనిపిస్తాయి. అందుకని బ్రెయిన్‌స్కాన్‌వంటి పరీక్షలు చేయించాలి. సాధారణ లైంగిక ఆసక్తి తగ్గిపోవటమనేది ఈ వయసులో సహజమే. ఇలాంటి అసాధారణమైన కోరికలు రావటమనేది మీ మెదడులో మార్పుల కారణంగా తలెత్తుతున్న సమస్య. అందుకని దీనికోసం క్షుణ్ణంగా పరీక్షలు చేయించాలి. డీజనరేషన్‌ ఎక్కువైతే మారాలనే ఆలోచన కూడా తగ్గిపోతుంది. అలాగే ఉండిపోవాలనే ఇష్టం పెరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కువ కాలం అశ్రద్ధ చేయకుండా, వీలైనంత త్వరగా న్యూరాలజిస్టునుగానీ, సైకియాట్రిస్ట్‌నుగానీ సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించి, చికిత్స తీసుకోవటం మంచిది.

  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail