Your Name : Your Email :

Health problem :

Thursday, November 17, 2011

బి.పి, షుగర్‌ ఉన్నవారికి సెక్స్ సామర్ధ్యము

 Q : నాకు గత రెండేళ్ళ నుంచి బి.పి, షుగర్‌ ఉన్నాయి. రెండూ కంట్రోల్‌లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం అంగం గట్టిపడడం లేదు. నా అంగం చిన్నదిగా అయినట్లు అనిపిస్తుంది. పరిష్కారం తెలుపండి.

A : మధుమేహం ఉన్న వారిలో సుమారు 40 శాతం మందిలో అధిక రక్తపోటు కూడా ఉంటుంది. మధు మేహం ఎక్కువ కాలం ఉన్న వారిలో రక్తపోటు పెరుగు తూనే వస్తుంది. కనుక ఈ రెండూ ఉన్న వారు తగిన మందులు వాడుతూ వ్యాయామం చేయాలి. ఆహార విహారాల్లో అదుపు తప్పనిసరి. ఈ రెండూ ఉన్నందువల్ల కలిగే మానసిక తీవ్రత వల్ల కూడా అంగస్తంభనలు కలుగవు. అంగం చిన్నదవడం జరుగదు. అది కేవలం మీ భావన మాత్రమే. మంచి ఆహారం తీసుకుంటూ మానసికంగా ఉత్సాహంగా ఉండండి. తిరిగి అంగస్తంభనలు ఏర్పడుతాయి. అవసరమైతే వైద్యుడిని సంప్రదించండి.



  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail