Your Name : Your Email :

Health problem :

Wednesday, November 23, 2011

దాంపత్యజీవితంలో పాల్గొనకపోతే నష్టమా?

ప్ర : నా భార్య మిగతా అన్ని విషయాల్లో బాగానే ఉన్నా, దాంపత్య జీవనం వరకు వచ్చేసరికి మాత్రం దూరంగా ఉంటోంది. ఆమెను ఇ బ్బంది పెట్టడం ఇష్టం లేక నేను కూడా ఆ విషయంలో ఎక్కువగా ఒత్తిడి చేయడం లే దు. దాంపత్యజీవితంలో పాల్గొనకపోతే నష్టమా?
జ : దంపతుల మధ్య అనుబంధం పెరిగేందుకు దాంపత్యజీవితం దోహదపడుతుంది. పెళ్ళి అయిన తరువాత ఓ వ్యక్తి ఎక్కువ కాలం పాటు దాంపత్యజీవితానికి దూరంగా ఉంటే దాని ప్రభావం పలు విధాలుగా ఉంటుంది. మానసిక,శారీరక ఆరోగ్యంపై ఈ ప్రభావం ఉంటుంది. సెక్స్‌లో పాల్గొనకుండా ఉంటే ఆరోగ్యం బాగుంటుందని, శరీరంలో ‘శక్తి’ పెరుగుతుందని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అది అపోహ మాత్రమే. వారితో పోలిస్తే దాంపత్య జీవితాన్ని చక్కగా అనుభవించే వారే మానసికంగా, శారీరకంగా మరింత శక్తివంతులుగా ఉంటారు. మనిషిలో సెక్స్‌కోరికలు సహజం. ఆ కోర్కెలను బలవంతంగా అదిమిపెడితే మానసికంగా చిక్కు లు కలుగుతాయి. దీని వలన నిద్ర తగ్గుతుంది. చికాకు పెరుగుతుంది. ఆదుర్దా అధికమ వుతుంది. దృష్టి కేంద్రీకరణ (ఏకా గ్రత) సమస్య తలెత్తుతుంది. చివరకు ఇవన్నీ కలగలసి వివిధ రకాల శారీరక సమస్యలకు దారి తీసే అవకాశం కూడా ఉంది.
  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail