Your Name : Your Email :

Health problem :

Wednesday, November 23, 2011

అంగ స్తంభన సరిగా లేదు వయాగ్రా లాంటి మందులు వాడవచ్చునా?

ప్ర : నా వయస్సు 65 సంవత్సరాలు. భార్య వయ స్సు 60. నలుగురు సంతానం. ఇన్నాళ్ళూ రక రకాల బాధ్యతలతోనే కాలం గడిచి పోయింది. దాంపత్యజీవితాన్ని ఎంజాయ్‌ చేయలేకపోయాం. ఇప్పుడు కావాల్సినంత ఏకాంతం లభిస్తున్నా, ఆనందించే మార్గం కానరావడం లేదు. అంగ స్తంభన సరిగా లేదు. ఎంతో కొంత మేరకు దాంపత్య జీవితాన్ని ఆనందించే మార్గం ఉందా? వయాగ్రా లాంటి వాటితో ఫలితం ఉంటుందా? ఇతర దుష్ఫలితాలు ఏవైనా ఉంటాయా?
జ: వయాగ్రా అనేది దివ్యౌషధమేమీ కాదు. పలురకాల ఇతర ఔషధాలకు ఉన్నట్లుగానే దీనికి ఇతర దుష్ఫలితాలు ఉంటాయి. వాటి తీవ్రత మాత్రం ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. అందరిలోనూ ఈ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఒకే విధంగా ఉండవు. పైగా, ఈ ఔషధాన్ని వైద్యుల సలహా మేరకే వాడాలి. ఏవైనా ఇతర సమస్యలు తలెత్తితే వెంటనే డాక్టర్‌ దృష్టికి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. ఇక మీ సమస్య పరిష్కారం విషయానికి వస్తే, లైంగిక అనుభవంలో నాలుగు దశలుంటాయి. ఒకటి కోరిక కలగడం, రెండవది అంగస్తంభన. మూడవదశ అంగప్రవేశం, నాలుగవ దశ భావప్రాప్తి. వయస్సు పెరుగుతున్న కొద్దీ పురుష హార్మోన్‌ ఉత్పత్తి తగ్గి అంగస్తంభన, భావప్రాప్తి కలగడంలో జాప్యం ఏర్పడవచ్చు. వీర్యకణాలు తగ్గవచ్చు.

ఈ ఇబ్బందులు కనిపిస్తే పురుష హార్మోన్‌ను పెంచే ఆకుకూరలు, కూరగాయలు, మినుములు తీసుకుంటే మేలు కలుగుతుంది. రక్తంలో టెస్టోస్టీరాన్‌ స్థాయి కోసం పరీక్ష చేయించుకో వాలి. ఈ పరీక్ష ఉదయం 10 గంటల లోపు చేయించుకోవాలి. దీని స్థాయి తగ్గిందని తేలితే, వైద్యుల పర్యవేక్షణలో హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకోవాలి. మీలో లైంగిక వాంఛలు, భావప్రాప్తి బాగానే ఉండి, అంగస్తంభన, అంగంలో గట్టితనం సమస్యలు అధికంగా ఉంటే వైద్యుల సలహా మేరకు వయాగ్రా వాడవచ్చు. దీనిని దంపతులు కలుసుకోవడానికి ఒక గంట ముందు, ఆహారం తీసుకోకుండా వాడాలి. రక్తపోటు మందులు వాడుతున్నా, ఇతరత్రా గుండె జబ్బులవలన  వైద్యులు వద్దన్నా దీన్ని ఉపయోగించవద్దు.
=============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail