Your Name : Your Email :

Health problem :

Thursday, December 22, 2011

పెరాలసిస్‌(పక్షవాతం) వచ్చినవారిలో సెక్సు కోరి కలు ఏమవుతాయి?

Q : పెరాలసిస్‌(పక్షవాతం) వచ్చి కాలు, చేయి పడి పోవటం ఎందువల్ల జరుగుతుంది. మూతి కూడా వంకర పోవటం విధిగా జరుగుతుందా లేక మూతి వంకర పోకుండా కాలు చేతు లు మాత్రమే వంకరపోవడం ఉందా? ఈ వ్యాధి వచ్చినవారు తీసుకోవలసిన జాగ్రత్త లేమిటి? ఈ వ్యాధి వచ్చినవారిలో సెక్సు కోరి కలు ఏమవుతాయి? ఒకసారి వస్తే జీవితాం తం కోలుకోరా? అటువంటి వ్యాధిగల వారి తో సెక్సులో పాల్గొనవచ్చా?

A : పెరాలసిస్‌(పక్షవాతం) చాలా విస్తారమైన టాపిక్‌. దాన్నంతటినీ ఇక్కడ చర్చించటం అసాధ్యం. కావున కొద్దిగానే రాస్తాను. మెదడులో ని కానీ, వెన్నుపాములో కానీ, నాడుల్లోకానీ కొంతమేర దెబ్బతిన్నా, వ్యాధికి లోనైనా ఆయా భాగాలు శరీరంలో ఏ అవయవాలను నియంత్రిస్తాయో, ఆ అవయవాలన్నీ చచ్చుబ డిపోతాయి. హై బీ.పీ., ఉన్నవారికీ, అత్యధి కంగా ఆందోళనపడే వారికీ కూడా స్ట్రోక్‌ వచ్చే అవకాశం ఉంది. పెరాలసిస్‌ చికిత్స చెప్పటం మా పరిధిలోకి రాదు. అది న్యూరాలజిస్టు చేయాల్సిన పని! ఇకపోతే పెరాలసిస్‌ అనంతరం సెక్సు! ఇది పేషెంటు పెరాలసిస్‌ నుంచి ఎంత బాగా కోలుకున్నాడనే విషయం మీద అధార పడి ఉంది. ఆ సమయంలో అ తని/ఆమె వయసెంత? పెరాలసిస్‌కి ముందు వారు సెక్సులో ఏ మాత్రం చురుగ్గా ఉండేవారు? వంటి విషయాల మీద కూడ ఆధారపడుతుంది.

కుడిపక్క శరీర అవయవాలు పెరాలసిస్‌కి లోనైన వారికి కామవాంచ సన్న గిల్లు తుంది. ఎడమ భాగాలు చచ్చుబడిన వారికి కామవాంఛ తగ్గదు. మగవారికి స్తంభనం బలహీనంగా ఉంటుంది. స్ఖలనం కాకపోవచ్చు. భావప్రాప్తి కలగకపోవచ్చు. ముఖ్యంగా కాళ్ళు చేతుల కదలికలు, శరీరం కదప డం విషయంలో కోఆర్డినేషన్‌ సరిగా ఉండదు. మానసికంగా కలిగే డిప్రెషన్‌ కూడా అదనంగా సమస్య కలిగిస్తుంది. అయినప్పటికీ భార్య సహకారమూ, కోరికా ఉంటే సెక్స్‌ లైఫ్‌ని చాలామటుక్కి పునరుద్ధరించుకోవచ్చు. ఈ విషయంలో మీరు దిగులు చెందాల్సిన అవసరం లేదు.


  • ================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail