Your Name : Your Email :

Health problem :

Sunday, February 12, 2012

పిల్లలు పుట్టాక శృంగారం పట్ల ఆసక్తి తగ్గుతుందా?

Q : నాకు ఆరునెలల అమ్మాయి. పిల్లలు పుట్టకముందు శృంగారం పట్ల ఆసక్తి ఉండేది. ఇప్పుడు శృంగారం అంటే విముఖంగా ఉంటోంది. మావారికి అది లేనిదే నిద్ర పట్టదు. ఏం చెయ్యమంటారు?


A : సాధారణంగా పిల్లలు పుట్టాక చాలామంది స్ర్తీలకు శృంగారంలో ఆసక్తి తగ్గుతుంది. కార ణాలు చాలావుంటాయి. కొత్తగా వచ్చిన పసిపాప బాధ్యత, 24 గంటలూ పాపమీదే మన సు కేంద్రీకరించడంతో రాత్రుళ్లు నిద్ర తక్కువగా ఉండటం, ఇవిగాక ప్రసవానంతరం అసమతుల్యం వలన పోస్ట్‌నేటల్‌ డిప్రెషన్‌ కూ డా వచ్చే అవకాశం ఉంది. దీనివలన కూడా చిరాకు, కోపం, సెక్స్‌ పట్ల విముఖత ఉండే అవకాశం ఉంటుంది. మనసు, శరీరం రెం డూ కూడా అలసిపోవడం వంటి కారణాలతో సెక్స్‌ పట్ల విముఖత ఏర్పడే అవకాశం ఉం టుంది. మగవారు కూడా ఆడవారి మానసిక, శారీరక స్థితులను అర్థం చేసుకోవాలి. పాప పెంపకంలో ఇంటిపనుల్లో తండ్రిగా, భర్తగా సమాన బాధ్యతలు పంచుకుంటూ చేదోడువాదోడుగా ఉండాలి. అది అతని కనీస బాధ్యత. పిల్లల పెంపకం, ఇంటిపని కేవలం స్ర్తీలకు సంబంధించినది మాత్రమే కాదు అది భార్యాభర్తల సమష్టి బాధ్యత అని గుర్తెరిగి మసలుకుంటే ఇద్దరికీ మంచిది.



  • =================================
డా.శేషగిరిరావు వందన - శ్రీకాకుళం

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail