Your Name : Your Email :

Health problem :

Sunday, February 12, 2012

రతి సమయంలో పొత్తికడుపు నొప్పి

Q : మా ఆవిడ రతి సమయంలో అంగప్రవేశం జరగగానే తన పొత్తికడుపు బాగా నొప్పిగా ఉంటోందని అంటోంది. దీనికి పరిష్కారం తెలియజేయండి.

A : దీనికి పరిష్కారానికి ముందుగా మీరు మీ భార్యతో శృంగారం తాత్కాలికంగా నిలిపివేసి మంచి డాక్టరును సంప్రదించాలి. ఇప్పటికే మీరు చాలా ఆలస్యం చేశారనుకుంటున్నాను. ఆమెను వెంటనే దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్‌కు చూపించండి. సాధారణంగా వెజైనల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ ఉన్నా, గర్భాశయం లోపల చుట్టూ ఉండే అవయవాల్లో ఇన్‌ఫెక్షన్‌ ఉన్నా శృంగారం తర్వాత బాగా నొప్పి అనిపిస్తుంది. అప్పుడు ఆమెకు శృంగారం పట్ల విముఖత ఏర్పడుతుంది. అంతేకాదు ఏవైనా మానసిక ఆందోళనలు ఉన్నాకూడా భయంతో వెజైనల్‌ కండరాలు అసంకల్పితంగా ముడుచుకుపోతాయి. ఒకవేళ అంగప్రవేశం బలవంతంగా చేస్తే భరించలేని నొప్పి కలుగుతుంది. అందుకని కొన్నాళ్లు ఆమెలో భయాందోళనలు తొలగేదాకా... ఆమె భర్త ఫోర్‌ప్లే విధానం ద్వారా ఆమెలోని అనవసర భయాలను పోగొట్టాలి. ఒకవేళ లోపలి అవయవాలలో ఇన్‌ఫెక్షన్‌ ఏర్పడితే దగ్గరలోని గైనకాలజిస్ట్‌ను సంప్రదించాలి. ఎట్టి పరిస్థితిలోనూ అశ్రద్ధ చేయకూడదు.
  • ===============================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail