Your Name : Your Email :

Health problem :

Tuesday, February 14, 2012

పిల్లలు పుట్టే యోగం లేనట్లేనా?











Q : నా వయస్సు 32. ఆయనకు 35. పెళ్ళయి పదిహేనేళ్ళయింది. పిల్లలులేరు. రెండు సార్లు డి అండ్గ సి చేయించుకున్నా ఫలితం లేదు. నేను పొట్టిగా (5 అడుగులు) ఉంటా ను. నెలసరి గతంలో సరిగా వచ్చేది కాదు. ఇప్పుడు ఫర్వాలేదు. రక్తహీనత కారణంగా మూడు సార్లు రక్తం ఎక్కించారు. ఆరేళ్ళ క్రితం థైరాయిడ్‌ పరీక్షలు చేయించుకున్నా ను. ఇటీవల డాక్టర్‌ను సంప్రదిస్తే మందులు రాసిచ్చారు. మూడు నెలలుగా వాడుతున్నా ఫలితం లేదు. ఇక నాకు పిల్లలు పుట్టే యోగం లేనట్లేనా?

A : మీవారి సెమెన్‌ ఎనాల్సిస్‌ రిపోర్ట్‌ సాధారణంగానే ఉందని అంటున్నారు. రెండుసార్లు డి అండ్‌ సి చేశారని, థైరాయిడ్‌ రిపోర్టులు బా గానే ఉన్నాయని పేర్కొన్నారు. వయస్సు 32. పెళ్ళయిన పదిహేనేళ్ళలో ఒక్కసారీ గర్భం రా లేదు కనుక మిగిలిన పరీక్షలన్నీ చేయాలి. అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ ద్వారానూ, లాపరోస్కోపీ, హిస్టెరోస్కాపీల ద్వారాను అంతర్‌ జననేంద్రి యాలైన గర్భాశయమూ, అండాశయాలు, ఫెలోపియన్‌ ట్యూబులను వివరంగా పరీక్షించి చూడాలి. థైరాయిడ్‌తో పాటు మిగిలిన ఎఫ్‌. ఎన్‌.హెచ్‌ ప్రొలాక్టన్‌ వంటి హార్మోన్ల అసమతు ల్యత లేదని నిర్ధారించుకోవాలి. ఇవన్నీ జరిగి న తరువాత చికిత్సను చురుకుగా మొదలు పెట్టాలి. మీకెలాంటి చికిత్స అవసరమవుతుం దన్నది కారణాన్ని బట్టి ఉంటుంది. 35 సంవ త్సరాలు దాటితే హార్మోన్లు, అండాల నాణ్యత లోపిస్తుంది కనుక త్వరపడండి.



  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail