Your Name : Your Email :

Health problem :

Thursday, February 16, 2012

బిపి-గుండెజబ్బుకు సంబంధించిన మందులు వాడితే అంగం గట్టిపడదా?

ప్ర : నా వయసు 57 సంవత్సరాలు. సెక్స్‌ కోరికలు ఎక్కువ. అయితే 1995లో బీపీ కంట్రోల్‌ కో సం డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడటం మొదలుపెట్టాను. 2005లో ఏంజియోప్లాస్ట్రీ ఆపరేషన్‌ చేసారు. వాటికి సంబంధించిన మందులు ప్రస్తుతం వాడుతున్నాను. సెక్స్‌ విషయంలో నా భార్య సహకారం ఉన్నప్పటికీ.. అంగం గట్టిపడక చాలా సిగ్గుపడుతు న్నాను. ఎట్లాగయినా సెక్స్‌లో పాల్గొనాలని ఉంది. అందుకని ఒక సెక్సాలజిస్ట్‌ను కలిశాను. ఆయన సలహా మేరకు మందులు వాడుతునేవున్నాను. అయినా ఫలితంలేదు. స్మోకింగ్‌ అలవాటు లేదు. కాకపోతే అప్పుడ ప్పుడు డ్రింక్‌ చేస్తాను. నాకు తగిన సలహా ఇయ్యండి.

జ : మీరు బిపి, గుండెజబ్బుకు సంబంధించిన మందులు వాడుతున్నారు, ముఖ్యంగా మీరు రక్తప్రసరణవేగం పెంచి గుండెకు అధిక భారాన్ని పెంచే మందులు వాడకండి. మీరు వాడే బిపికి సంబంధించిన మందులు మీ కార్డియా లజిస్ట్‌ను వెంటనే మార్చమని చెప్పండి. మానసిక వ్యథ మూలంగా కలిగే ఒత్తిడి కూడా రక్తప్రసరణ వేగం పెంచే ‘నో’ టాబ్లాయిడ్స్‌ మీ మెదడునుంచి రిలీజ్‌ కాకుండా చేస్తుంది. మందుల కన్నా కూడా ముఖ్యంగా మీరు రిలాక్సేషన్‌ టెక్నిక్స్‌ ప్రాక్టీస్‌ చేయండి. ఆందోళనపడు తూసెక్స్‌లో ఉపక్రమించకండి. ఆయుర్వేదంలో కూడా మంచి మందులు ఉన్నాయి. ప్రయత్నించి చూడండి.
  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail