Your Name : Your Email :

Health problem :

Thursday, February 16, 2012

స్త్రీని ఉత్తేజం కలిగించడానికి ఏమైనా మందులు ఉన్నాయా?

మా పెళ్లయి 15 సంవత్సరాలు. ఇద్దరు పిల్లలు. నా భార్యకు 42 సంవత్సరాలు. ఆమెకు రతిపట్ల ఆసక్తి కలగడంలేదు. ఆమె పెళ్లయిన పది సంవత్సరాల దాకా బాగానే సహకరించింది. అయితే ఈ మధ్య ఎందుకో అనాసక్తి ప్రదర్శిస్తోంది. నాకు రోజూ సెక్స్‌ కావాలని ఉంటుంది. ఆమెలో ఉత్తేజం కలిగించడానికి ఏమైనా మందులు ఉన్నాయా? తెలపగలరు.

ముందుగా మీరు మీ భార్య ఎందుకు అలా ఫ్రిజిడిటీగా మారిందో తెలుసుకోవాలి. ఆమె ప్రిమోనోపాసల్‌ స్టేజీలోకి వెళుతు న్నారా... పీరియడ్స్‌ రెగ్యులర్‌గా ఉన్నాయా? మీ ప్రవర్తన ఆమెలో అసహనం కలిగిస్తోందా? ఆమెను అగౌరవపరిచేవిధంగా ఉంటోందా? ముందు మీ ఇద్దరి సంబంధబాంధవ్యాలు ఎలా ఉన్నాయి? లేక మీలోనే ఏదైనా అంగ స్థంభన లోపం గానీ, శీఘ్రస్కలనలోపం కానీ ఉండి మీ భార్యను సంతృప్తిపరచలేకపోతు న్నారా? ఎందుకు ఆమె మిమ్మల్ని తిరస్కరి స్తోంది. ఇవన్నీ తరచిచూడాలి. ముందు మీరు మంచి సెక్సాలజిస్ట్‌ను మీ భార్యతో కలవండి. ఇద్దరిలో ఆసక్తి... ఆరోగ్యం ఉంటే రోజూ సెక్స్‌లో పాల్గొనడం ఆరోగ్యరీత్యా మంచిదే.

స్త్రీని ఉత్తేజం కలిగించడానికి ఏ మందులు లేవు . ఇస్టా అయిస్టాల పైనే ఆధారపడి ఉంటుంది .

  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail