Your Name : Your Email :

Health problem :

Tuesday, February 14, 2012

Frigidity , ఫ్రిజిడిటీ



Q : ఫ్రిజిడిటీ అంటే ఏమిటి ? ఎలా అధిగమించాలి ?

A : ఫ్రిజిడిటీ రెండు రకాలుగా ఉంటుంది.

ప్రైమరి ఫ్రిజిడిటీ:
ఈ కోవకి చెందిన స్ర్తీ ఎన్నడూ భర్తతోనైనా, మరొకరితోనైనా సెక్స్‌ ప్రేరణ పొందడం, థ్రిల్‌ పొందడం జరగదు.

సెకండరీ ఫ్రిజిడిటీ:
-ఇటువంటి స్త్రీలు ఎల్లప్పుడూ కాకపోయిన అప్పుడప్పుడు సెక్స్‌ లో అనుభూతి, సుఖ ప్రాప్తి పొందడం జరుగుతుంది. వారికి తగిన సమ యం సందర్భం అవసరమవుతుంది. కొందరు తమ భర్తతో సెక్స్‌లో స్పందనలు పొందనివారు మనసు పడిన మగవానితో సెక్స్‌లో థ్రిల్‌ పొందడం జరుగుతుంది. కొందరు స్ర్తీలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు తీయ ని అనుభూతులు పొందుతారు. ద్రవాలు స్రవిస్తాయి. కానీ క్లైమాక్స్‌కి చేరడం, సుఖప్రాప్తి(ఆర్గజం) పొందడం వుండదు.

సెక్స్‌ లో కొంత మేరకే అనుభూతులు పొందుతారు. ఇటువంటి పరిస్థితి కూడా ఫ్రిజిడిటీ కిందకే వస్తుంది. వీరికి తెలియని ఇన్‌హిబిషన్స్‌ వుండి ఉరకలేసే మనసుకి అడ్డుపడడంతో స్పందనలు కొంతమేరకే కలిగి అంతకంటే ముందుకు సాగవు. ఇటువంటివాళ్ళు సెక్స్‌లో పాల్గొ న్నప్పుడు మోడస్టీని, హోదాని మరచి ఫ్రీగా పాల్గొంటే సుఖప్రాప్తి పొందుతారు. లేకపోతే సెక్స్‌లో పాల్గొనడం మొక్కుబడిగా తయారౌతుంది. ఇటువంటివారు ఎటువంటి పరిస్థితులు, పరి సరాలు, మానసిక స్థితిగతులు అవరోధంగా మారుతున్నాయో తెలుసుకుని వాటిని చక్క దిద్దుకోవాలి.

మొదటి కలయికలో కలిగే బాధ అనాసక్తిని కలిగిస్తుంది!
కొందరు స్ర్తీలు కౌగిలింతలు, ముద్దులతో కరిగిపోతారు. క్లైటోరిస్‌ స్టిమ్యులేషన్‌తో పులకిం చిపోతారు. తీరా అంగ ప్రవేశం జరపబోయే సరికి ముడుచుకుపోతారు.దానికి కారణం వారిలో అంగప్రవేశం నొప్పి కలిగించడమో, సంయోగం అంటే భయం వుండడమో కారణం. యోనిమార్గంలో పుండు, గర్భాశయం వాపు, పొత్తికడుపులో నరాల వాపు వుంటే సంయోగం నొప్పి కలిగిస్తుంది. అంగప్రవేశం జరపబోయేసరికి నొప్పితో, ఒక్కసారిగా చెల రేగిన కామం మీద చన్నీళ్ళు చల్లడమవుతుం ది. అలాగే సెక్స్‌ యాక్ట్‌ గురించి భయంకన్నా అసలు సమయంలో ముడుచుకుపోవడం జరుగుతుంది. అదే ఆమెలో వుండే ఫ్రిజిడిటీకి ముఖ్యమైన కారణం. ఇలా ఫ్రిజిడిటీ అనేక రకాలైన శారీరక, మా నసిక కారణాలు వున్నాయి. కొన్ని అంతుపట్టే కారణాలు. మరికొన్ని అంతుపట్టని కారణాలు. శారీరక కారణాలు చాలా వరకు తెలుస్తాయి. వాటిని సరిదిద్దవచ్చు.

అమ్మాయిలలో సెక్స్‌ని మేల్కొలపడం
ఫ్రిజిడిటీ వున్న స్ర్తీలో జడత్వం పోగొట్టి సెక్స్‌ ప్రేరణలు కలిగించడానికి మాస్టర్స్‌ అండ్‌ జాన్సన్స్‌ టెక్నిక్‌ చాలావరకు తోడ్పడుతుంది. పడకగదిలో బెడ్‌మీద దంపతులిద్దరూ వివస్త్రులై ఈ టెక్నిక్‌ని ప్రాక్టీస్‌ చేయాలి. భర్త కాళ్ళు రెండూ చాసి బెడ్‌మీద కూర్చోవాలి. భర్త రెండుకాళ్ళ మధ్య భార్య అతన్ని అనుకుని కూర్చోవాలి. భర్త అమె మెడ దగ్గర నుంచి వివిధ భాగాల వరకు మృదువుగా తన చేతులతో నిమరాలి. ప్రేరేపణ కలిగించాలి. అలా కొద్ది రోజులు అమె శరీరంలో వివిధ భాగాలని స్సృశిస్తే నిద్రాణం నుంచి మేల్కొం టాయి. మనసుని మురిపిస్తాయి. చివరికి గువ్వలా అతనిలో ఒరిగిపోయేలా చేస్తాయి.
  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail