Your Name : Your Email :

Health problem :

Tuesday, February 14, 2012

పెళ్ళి చేసుకోనంటున్నాడు



Q : నాకు 28 ఏళ్ళ వయస్సున్న కొడుకు ఉన్నాడు. బహుళజాతి సంస్థలో ఉద్యోగం. కానీ, పెళ్ళి చేసుకోనంటున్నాడు. స్త్రీలంటేనే మండిపడు తాడు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే వెంటనే తలనొప్పితో బాధపడుతాడు. తనకు ఎయిడ్గ్స వచ్చిందేమోనని తరచూ పరీక్షలు చేయించు కుంటూ ఉంటాడు. ఎంత చెప్పినా వినడం లేదు. వాళ్ళ నాన్న విదేశాల్లో ఉండేవారు. బాబు బాధ్యత నేనే చూసుకోవాలి కాబట్టి క్రమశిక్షణతో పెంచాలన్న ఉద్దేశంతో ఆడపిల్ల లతో మాట్లాడవద్దని, వారితో స్నేహం లైంగిక వ్యాధులకు దారి తీస్తుందని చెప్తుండేదాన్ని. అదే ఇంత వరకు దారి తీసిందని అనిపిస్తోం ది. తనని మామూలు మనిషిని చేయడమెలా గో అర్థం కాక కుమిలిపోతున్నాను.(- ఒక సోదరి)

A : తల్లిగా బిడ్డను దారి తప్పకుండా చూడడం వరకు ఫర్వాలేదు కానీ మరీ ఈ స్థాయిలో కాదని మీరు ఆలస్యంగా తెలుసుకున్నారు. మీ బోధలు సహజంగా స్త్రీల పట్ల పురుషుల్లో ఉండాల్సిన ఆకర్షణను, ఆసక్తిని పోగొట్టడమే కాక... వారి పట్ల అసహ్యాన్ని పెంచాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. సాధారణ అవివాహిత పురుషుడికీ, మీ అబ్బాయికీ చాలా తేడా ఉంది. మీ అబ్బాయి మామూలు మనిషి కావాలంటే మానసిక వైద్యుల సాయం తప్పనిసరి. సెక్స్‌ థెరపిస్టుల సలహా తీసుకోవాలి. మీకూ కౌన్సెలింగ్‌ అవసరమే. తన ప్రవర్తన మారడానికి మీరెలా సహకరించాలో కౌన్సెలింగ్‌లో చెప్తారు. సంకోచించకుండా వెంటనే వైద్యులను సంప్రదించండి.


  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail