Your Name : Your Email :

Health problem :

Friday, September 19, 2014

ట్రైగ్లిజరైడ్స్‌.. అదుపు ఎలా?, How to controle Triglycerides



Q : నా వయసు 64 సంవత్సరాలు. ఇటీవల ట్రైగ్లిజరైడ్స్‌ పరీక్ష చేయిస్తే 186 ఎంజీ/డీఎల్‌గా వచ్చింది. వీటిని అదుపులో ఉంచుకోవటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించండి.

A : మామూలుగా ట్రైగ్లిజరైడ్స్‌ 200 వరకూ ఉన్నా ఫర్వాలేదు. అయితే.. అధిక రక్తపోటు, మధుమేహం, కుటుంబంలో గుండె జబ్బుల వంటివి ఉంటే ట్రైగ్లిజరైడ్స్‌ను 100 లోపలే ఉంచుకోవటం చాలా మంచిది. దీనివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది, దుష్ప్రభావాలు తగ్గుతాయి. మామూలుగా కొలెస్ట్రాల్‌ అనేది మన రక్తంలో ఉండే ఒక రకం కొవ్వు. ఇది చాలావరకూ మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ట్రైగ్లిజరైడ్స్‌ కూడా రక్తంలో ఉండే కొవ్వేగానీ.. ఇది వ్యాయామానికి సంబంధించినది. ట్రైగ్లిజరైడ్స్‌ పెరగటం గుండె జబ్బులకు దారితీస్తుంది. కాబట్టి దీనిని నియంత్రించటానికి మందులతో చికిత్స తీసుకుంటూనే వ్యాయామం చేయాలి. ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా వంశపారంపర్యంగా వస్తాయి. చికిత్స, వ్యాయామం రెండూ అవసరం.


  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail