Your Name : Your Email :

Health problem :

Tuesday, October 18, 2011

ఎన్నిసార్లు చేస్తే లైంగికంగా పటుత్వం వున్నట్టు భావించాలి

ప్రశ్న: నాకిపుడు ముప్పై అయిదేళ్లు. నాకు పెళ్లయి ఏడేళ్ళు అయ్యింది. మొదట్లో రోజుకు రెండుమూడుసార్లు సెక్స చేసేవాడ్ని. కాని ఇపుడు అలాకాదు. నాలో పటుత్వం పోయిందేమోనని భయంగా వుంది. అసలు ఎన్నిసార్లు చేస్తే లైంగికంగా పటుత్వం వున్నట్టు భావించాలి నాకు లైంగిక పటుత్వం పెరగాలంటే ఏంచేయాలి.

జవాబు: మీ వయసు కలిగిన వ్యక్తుల లైంగిక జీవితం మీద చేసిన అధ్యయనాలు సగటున వారానికి ఒకసారి మైధునంలో పాల్గొంటారని తేల్చిచెప్పాయి. ఈ రిపోర్టును ఆధారంగా చేసుకుని ఆలోచించినట్టయితే వారానికి ఒకసారి మీ మైథునంలో పాల్గొన్నా చాలు. మీలో లైంగికపటుత్వం ఏమాత్రం చెక్కు చెదరలేదనే భావించాలి. అందుచేత మీరు వారంలోపు ఇంకా ఎన్నిసార్లు సెక్సలో పాల్గొంటే అంత ఎక్కువగా మీరు యాక్టివ్‌గా వున్నట్టే. సహజంగా వయసులో వున్నప్పటి వాంఛ, అందుకు తగిన స్తంభన క్రమంగా తగ్గిపోతూ వుంటుంది. ఉత్కంఠభరితమయిన అంశంగా సెక్స కన్పించకపోడం కూడా ఇందుకు కారణమవుతుంది. మీ లైంగిక జీవితంలో ఆ ఉత్కంఠను ఎప్పటిలా పటిష్టంగా వుండేలా కాపాడుకోవాలంటే దాంపత్య జీవితంలో నవ్యతకు చోటివ్వండి. రతిలో పలు రకాల భంగిమలను ఎంపిక చేసుకోండి. లైంగికోద్రేకాన్ని కలిగించే అనుభూతలనేర్పరుచుకోండి. అంతకు మించి మీ లైంగికపటుత్వాన్ని పెంచడానికి ఏ వైద్యమూ అవసరం లేదు.

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail