Your Name : Your Email :

Health problem :

Tuesday, October 18, 2011

స్వైర కల్పనలు లేదా ఫాంటసీలు లైంగిక క్రియలను మరింత ఉత్తేజభరితంగా మలుస్తాయి

ప్రశ్న: నేను మైధున సమయంలో అపుడపుడు స్వైర కల్పనలను ఆశ్రయిస్తున్నాను. ఇది శారీరకంగా లైంగిక పటుత్వాన్ని తగ్గిస్తుందా... ఇదే అలవాటయిపోయి స్వైర కల్పనలు లేనిదే రతిలో పాల్గొనలేకపోవడం జరుగుతుందా ఎదురుగా భార్యను పెట్టుకుని ఇలా మరో వ్యక్తితో సెక్స చేస్తున్నట్లు ఉహించుకోవడం తప్పుకాదా ?.

జవాబు: స్వైర కల్పనలు లేదా ఫాంటసీలు లైంగిక క్రియలను మరింత ఉత్తేజభరితంగా మలుస్తాయి. ఇవి స్త్రీలలోను,పురుషులలోను లైంగికోద్రేకభావాలను పెంచి, యోనిలో అధిక స్రావాలు ఏర్పడడానికి, అంగజం కలగడానికి తోడ్పడతాయి. పురుషుల్లో అయితే అంగస్తంభనను పెంచుతాయి. ఫాంటసీలు ఎవరికి వారు తమ ఇష్టాన్ని బట్టి ఏర్పరచుకునేవి. కాబట్టి వాటిని రహస్యంగానే ఉంచుకోవడం జరుగుతుంది. అవగాహన వున్న దంపతులు తమ తమ లైంగిక స్వైర కల్పనలను పరస్పరం పంచుకోవచ్చు. అందువల్ల వారి దాంపత్య జీవితం మరింత ఉత్కంఠభరితమవుతుంది. కొంతమందిలో అవగాహనా లోపం చేత ఫాంటసీలను తప్పుగా భావించడం జరుగుతుంది. ఇవికేవలం ఊహలే తప్ప చేతలు కావు కాబట్టి వీటికి అంత ప్రాధాన్యత నివ్వాల్సిన పనిలేదు. ఫాంటసీలలో పలు రకాలయిన కథావస్తువుల్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఇది పూర్తిగా వైయుక్తిక లైంగికాభిరుచుల్ని బట్టి ఆధారపడి వుంటాయి. స్వైర కల్పనలో కథావస్తువును ఆధారంగా చేసుకుని దంపతులు పరస్పర వ్యక్తిత్వ లక్షణాలకు వీటిని ఆపాదించి చూడనంతకాలం వీటి వల్ల ప్రమాదమేమీ లేదు. ఐతే కొంతమందిలో ఈ ఉహలను ఆధారంగా చేసుకొని అవతలి వ్యక్తిని అపార్థం చేసుకునే అవకాశం వుంది. అటువంటి సందర్భాలలో ఆయా స్వైరకల్పనలే కావాలనుకుంటే రహస్యం తప్పదు. లేదా అందుకు ప్రత్యామ్నాయంగా ఎదుటివ్యక్తికి సైతం నొప్పి కలిగించని వస్తువుల్ని ఎంచుకోవడం తప్ప మార్గం లేదు. స్వైర కల్పనల కారణంగా లైంగిక పటుత్వం తగ్గిపోతుందని ఎక్కడా లేదు. ఇవి ఒక అలవాటుగా మారిపోయే అవకాశం కూడా లేదు. దంపతుల నడుమ లైంగిక జీవితాన్ని మరింత మధురంగా వుండేలా చేసుకోవడానికి ఇవి తోడ్పడతాయే తప్ప ఇందువల్ల శారీరకంగాను కాని,మానసికంగా కాని లైంగికత్వం ప్రభావితం కాదు.

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail