Q : నా వయసు ఇరవైఎనిమిది. నా ముఖం త్వరగా జిడ్డుగా మారిపోతోంది. రెండు నెలల నుంచి మొటిమలూ వస్తున్నాయి. ఇలా ఎందుకవుతోంది. ఈ సమస్యకు పరిష్కారం లేదంటారా.---- ఓ సోదరి
A : చర్మంలోని గ్రంథులు వయసుతోపాటు వెడల్పుగా తెరచుకొనే కొద్దీ నూనె గ్రంథులు వృద్ధి చెందుతాయి. అప్పుడే సమస్యలు మొదలవుతాయి. జిడ్డు వల్ల మురికి, క్రిములు చేరి.. అవి మూసుకుపోతాయి. ఫలితంగా మొటిమలు, బ్లాక్, వైట్‌హెడ్స్ సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు హార్మోన్లు కూడా నూనె గ్రంథుల్ని ప్రభావితం చేస్తాయి. వాటివల్ల మొటిమలు బాధిస్తాయి. మీ సమస్య కూడా అదే. దాన్ని నివారించాలంటే.. సాధారణ సబ్బులు కాకుండా నాణ్యమైన ఫేస్‌వాష్‌ను ఎంచుకోవాలి. గ్త్లెకోలిక్ ఆధారిత జెల్స్ వాడటం వల్ల అధిక జిడ్డు సమస్య అదుపులోకి వచ్చేస్తుంది. ఒకవేళ గ్రంథులు మూసుకుపోయి ఉన్నట్లయితే.. నూనె ఆధారిత మాయిశ్చరైజర్లు వాడాలి. రాత్రిళ్లు రెటొనిక్ యాసిడ్‌తో తయారుచేసిన క్రీంలు రాసుకుంటే జిడ్డు గ్రంథుల పని తీరును కొంతవరకు అదుపు చేయవచ్చు. ఈ సమస్యను తగ్గించుకునేందుకు కొన్నిరకాల పీల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. అలాంటివి చేయించుకోవడం వల్ల కొల్లాజిన్ ఉత్పత్తి పెరుగుతుంది. గ్రంథుల పనితీరుపై ఎండ ప్రభావం కూడా ఉంటుందని మరవకూడదు. చర్మంపై ఎండ ఎక్కువగా పడుతుంటే.. ముడతలు వచ్చే ఆస్కారం కూడా ఎక్కువే. ఎండ ప్రభావం లేకుండా జిడ్డు చర్మానికి తగిన సన్‌స్క్రీన్‌లోషనూ రాసుకోవాలి. దీన్ని నివారించేందుకు రేడియోఫ్రీక్వెన్సీ, లేజర్లు, స్టెమ్‌సెల్స్.. వంటి చికిత్సలు అందుబాటులో ఉంటాయి. ముందు మీరు వైద్యుల్ని సంప్రదించి అసలైన కారణాన్ని తెలుసుకోండి. ఆ ప్రకారం క్రీంలు ఎంచుకోవచ్చు. మరీ తీవ్రంగా ఉన్నట్లయితే ఆధునిక చికిత్సలు ప్రయత్నించవచ్చు.
=============================================
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Ask your health Question? with your e-mail