A : ఇరవై ఏళ్లుగా అధిక రక్తపోటు ఉందంటే.. మీరు దాన్ని కచ్చితంగా నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. సీరం క్రియాటినైన్ సాధారణంగా 1.5 వరకూ ఉండాలి. మీకు 1.8గా ఉందంటే.. మూత్రపిండాలు దెబ్బతినటం ఇప్పుడిప్పుడే మొదలవుతోందని అర్థం. మూత్రపిండాల వైఫల్యానికి దీన్ని ప్రారంభ సంకేతంగా భావించాలి. అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలపై ప్రభావం తప్పకుండా ఉంటుంది. 'ఏసీఈ ఇన్‌హిబిటార్స్' రకం రక్తపోటు మందుల వల్ల మూత్రపిండాలపై ప్రభావం ఉంటుంది. కాబట్టి వైద్యులను సంప్రదించి అన్ని విషయాలూ పరిశీలించి మందుల్ని వాడుకోవాల్సి ఉంటుంది. బీపీ నియంత్రణలో లేకపోయినా కూడా కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అవసరాన్ని బట్టి మందులు మార్చుకోవటం, రక్తపోటును పూర్తిగా నియంత్రణలో ఉంచుకోవటం.. ఈ రెండూ ముఖ్యమే. పెద్ద వయసులో సీరం క్రియాటినైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
- =============================================
No comments:
Post a Comment
Ask your health Question? with your e-mail