Your Name : Your Email :

Health problem :

Wednesday, November 23, 2011

గడ్డం, మీసం రాలేదు. వత్తుగా గడ్డం, మీసాలు రావాలంటే ఏం చేయాలి ?

 ఫ్ర : నా కంటే ఎక్కువ వయసున్న ఆంటీ తో సెక్స్‌లో పాల్గొన్నాను. నా వయ సు 20 సంవత్సరాలు. నెలకు 5 లేక 6 సార్లు హస్తప్రయోగం చేస్తాను. అంగస్తం భన బాగానే ఉంది. కానీ నాకు మగవారిలాగా... గడ్డం, మీసం రాలేదు. వత్తుగా గడ్డం, మీసాలు రావాలంటే ఏం చేయాలో తగిన సలహా ఇవ్వగలరు.
జ : పెళ్లికి ముందు, తర్వాత అక్రమ సంబంధాలు అనేక మానసిక, శారీరక వైఫల్యాలకు దారితీస్తాయి. ఆమె నుంచి మీరు దూరంగా వెళ్లిపోయి చదువుమీద దృష్టిసారించు. వారానికి 4 లేక 5 సార్లు హస్తప్రయోగం వలన ఎటువంటి శృంగారపరమైన వైఫల్యం రాదు. వీర్యం బయటకు పోవడం వలన ఎటువంటి నష్టమూ లేదు. హస్తప్రయోగం ఒక సహజమైన లైంగిక శరీరధర్మం. పగలు హస్తప్రయోగం చేసుకోకున్నా... భార్యతో కొన్నాళ్లు శృంగారంలో పాల్గొనకున్నా... రాత్రిళ్లు అంగస్తంభన కలిగి నిద్రలో వీర్యస్కలనం జరుగుతుంది. వీర్యం ఏదోవిధంగా శరీరం నుంచి బయటకు వెళ్లితీరాల్సిందే... లేకపోతే మెదడు, హార్మోన్లు రాత్రిపూట నిద్రలో వీర్యాన్ని బయటకు పంపేలా చేస్తాయి. ఇక నీ గడ్డాలు, మీసాలు సమస్య... ముందుగా నువ్వు ఆండ్రాలజిస్ట్‌ను కలువు. హార్మోన్‌ టెస్ట్‌ చేసి నీకు తగిన విధంగా చికిత్స చేస్తారు. దానివలన గడ్డాలు, మీసాలు వస్తాయి. అంగస్థంభన బాగానే ఉంది కాబట్టి శృంగారపరంగా ఏ సమస్యారాదు. తప్పుడు పనులు చేస్తేనే సమస్యలు వస్తాయి.  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail