Your Name : Your Email :

Health problem :

Wednesday, November 23, 2011

కాన్పు అయిన ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు?

ప్ర :  నాకు పెళై ఒకటిన్నర సంవత్సరం అయింది. నాకిప్పుడు 4వ నెల నడుస్తోంది. కాన్పు అయిన ఎన్ని రోజులకు శృంగారంలో పాల్గొనవచ్చు? మా వారికి కోరికలు ఎక్కువ. కానీ, నాకే గర్భంలోని పాపకి ఏమన్నా అవుతుందేమోనన్న భయం. కాన్పు అయ్యేదాకా... ఎన్నిరోజుల వరకు శృంగారంలో పాల్గొనవచ్చు. తగిన సూచన వెంటనే ఇవ్వగలరు.
జ : కాన్పు సహజంగా అయితే 45 రోజుల తర్వాత కూడా ఏ రకమైన దుర్వాసనతో కూడిన రక్తస్రావం కాకుండా గర్భసంచి మునిపటి స్థానంలోకి వెడితే 45 రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. కుట్టుపడితే అది పూర్తిగా ఎండిపోయి... ఆమెకు ఎటువంటి నొప్పి లేకుండా ఉంటే నిరభ్యంతరంగా 45 రోజుల తర్వాత సెక్స్‌లో పాల్గొనవచ్చు. సిజేరియిన్‌ ఆపరేషన్‌ ద్వారా కాన్పు అయితే 16 వారాలు కచ్చితంగా దాంపత్యజీవితంలో పాల్గొనకూడదు. అయితే దంపతులు పైపై స్పర్శ సుఖాలు పొందవచ్చును. అలాగే కాన్పుకు ముందు సెర్విక్స్‌కు కుట్లుపడటం... వెజైనల్‌ బ్లీడింగ్‌ అవడం... అంతకుముందు అభార్షన్‌ (గర్భాస్రావం) జరగడం లాంటివి ఉంటే... సెక్స్‌లో పాల్గొనకూడదు.

అయితే ఎటువంటి అనారోగ్యం లేకుంటే తొమ్మిదవ నెల వరకు అనుకూలమైన భంగిమలో... అంటే కడుపుపై భారం పడకుండా ఉన్న భంగిమలను దంపతులు ఎంచుకోవాలి. కాన్పుకు 10 రోజుల ముందు శృంగారం ఆపితే మంచిది. మీవారికి ఎంత కోరికలు ఉన్నా మీ గురించి... మీ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించడం మంచిది. ఒకవేళ బలవంతం చేస్తే మీలో ఉన్న సందేహాలకు తోడుగా అనవసరమైన భయాందోళనలు తోడై కాన్పుకు ముందు స్ట్రెస్‌కు లోనవుతారు. అది మీకు... మీ కడుపులోని పాపాయికి కూడా అంత మంచిది కాదు. గర్భిణీకి శారీరక ఆరోగ్యంతోపాటు మానసిక ప్రశాంతత చాలా అవసరం. మీవారు ఈ సంగతి గ్రహిస్తే మంచిది.

  • =============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail