Your Name : Your Email :

Health problem :

Wednesday, November 23, 2011

నా ఛాతి మీద స్ర్తీలకు వచ్చినట్లుగా కొంచెం ఉబ్బెత్తుగా ఛాతిభాగాలు ఏర్పడ్డాయి.-సలహా

ప్ర : నేనో వింత సమస్యతో బాధపడుతున్నాను. నా ఛాతి మీద స్ర్తీలకు వచ్చినట్లుగా కొంచెం ఉబ్బెత్తుగా ఛాతిభాగాలు ఏర్పడ్డాయి. వాటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి.

-జ : ఇదేమీ వింత సమస్య కాదు. ఎంతో తీవ్రంగా బాధపడాల్సిన సమస్య అంతకన్నా కాదు. మీ సమస్యను గైనకోమాస్టియా లేక హైపర్‌ట్రోఫీ ఆఫ్‌ మేల్‌ బ్రస్ట్‌ అనికూడా అంటారు. మగవారి రొమ్ముల్లో ఆడవారికి మల్లే పాలు స్రవించని గ్రంధులు, నాళాల సంఖ్య ఎక్కువ కావడం వలన అలాంటి సమస్య వస్తుంది. అంతేగాక ఈస్ట్రోజన్‌ అనే హార్మోన్లవలన కూడా వస్తుంది. ఇది ఎక్కువగా 13 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉండే టీనేజ్‌ మగపిల్లలలో ఎక్కువగా వస్తుంది. దీన్ని ప్యూబర్టల్‌ గైనకామిస్టియా అంటారు. 40-50 సంవత్సరాల మధ్య లో వచ్చేదాన్ని సెన్సెంట్‌ గైనకామిస్టియా అంటారు. అలాగే కొన్నిరకాల వినాశ గ్రంథుల వ్యాధుల్లో స్ర్తీలలో ఉండే్ ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండటం, పురుష ఆండ్రోజన్‌ల పనితీరు తగ్గడం జరుగుతుంటుంది. అవి పెపాటిక్‌ సిర్రోసిస్‌-(లివర్‌వ్యాధి), వృషణా లలో కణతలు, పిట్యూటరీ గ్రంధులు, లంగ్‌ క్యాన్సర్‌, అలాగే పురుషులలో ప్రొస్టేట్‌ కాన్సర్‌ వచ్చినపుడు, వృషణాల వ్యాధులు వచ్చినపుడు ఈస్ట్రోజన్‌ చికిత్సగా ఇచ్చినప్పుడు కూడా మగవారిలో రొమ్ములు పెరుగుతాయి. మీరు మీ దగ్గరలోని అండ్రాలజిస్ట్‌ వద్దకువెళ్లి ప్రొస్టేట్‌ కాన్సర్‌ తప్ప వేరే ఇతర వ్యాధులేవైనా ఉన్నాయేమో టెస్ట్‌ చేయించుకోండి. గైనకోమాస్టియా సర్జరీ ద్వారా కూడా తగ్గించవచ్చు. ప్లాస్టిక్‌ సర్జరీ విధానాన్ని కూడా సంప్రదించవచ్చు. ఈ సమస్యవున్నవారు డాక్టర్‌ సలహా మేరకు తగిన చికిత్స జరిపించుకోవాలి.

=============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail