Your Name : Your Email :

Health problem :

Thursday, December 8, 2011

సెక్స్ చేసే సమయంలో స్త్రీ తృప్తి చెందిందా.. లేదా..? అని తెలుసుకోవాలనుకోవడం ఎలా?

Q : సెక్స్ చేసే సమయంలో స్త్రీ తృప్తి చెందిందా.. లేదా..? అని తెలుసుకోవాలనుకోవడం ఎలా?

A : మానవునిలో కోరిక సెక్స్ సంబంధాల వలన కలుగుతుంది. అంటే మనస్సులో కలిగే సెక్స్ ఉద్వేగాలు రతి భావనగా మారతాయి. ఆ బలమైన భావమే స్త్రీలో యోని ప్రకోపంగా మారుతుంది. అదే అగ్రస్థాయికి చేరినప్పుడు "ఇక చాలు" అనిపిస్తుంది. ఆ దశకు చేరిన స్త్రీ మనసు మైమరిచిపోతుంది. ఈ స్థితినే ఆర్గాజం లేదంటే క్లైమాక్స్ దశ అంటారు.

దీనిని పురుషుడు తెలుసుకోవడం కష్టమే. అయితే స్త్రీకి ఈ అనుభూతి కలిగినప్పుడు అది ఆమెకే తెలుస్తుంది. నాకు తృప్తి కలిగిందని ఎన్ని విధాలుగా ఆమె వర్ణించి చెప్పినా చీకట్లో వెలుతురు చూపించడం లాంటిదే అవుతుంది. స్త్రీలో భావప్రాప్తి రెప్పపాటులో జరిగిపోతుంది. ఆ క్షణంలో ఆమెలో చోటుచేసుకునే సున్నితమైన శారీరక పరిణామాలు కొన్ని గమనించవచ్చు. ఆమె కనుపాపలు పెద్దవవుతాయి. చనుమొనలు బిగుసుకుని ఉంటాయి. మొత్తం శరీరం అదోరకమైన ఉద్వేగంలో పరుగులు తీస్తుంటుంది. ఇవన్నీ ఆమెలో జరుగుతున్నాయా..? లేదా..? అని చూడాలంటే రతి సుఖం కాస్తా దూరమైపోతుంది. అంగస్తంభన అర్థంతరంగా ఆగిపోతుంది. ఆ దశలో ఆమెకు ఈ పరిణామం చికాకును తెప్పిస్తుంది. కనుక రతి సమయంలో స్త్రీ భావప్రాప్తికి లోనవుతుందా... లేదా అనే విషయాన్ని స్త్రీకే వదిలేయాలి. పురుషుడు దానిని పరీక్షించాలని చూడకూడదు.

ఇకపోతే కొందరు స్త్రీలు ఒకసారికన్నా ఎక్కువసార్లు భావప్రాప్తిని పొందుతారు. ఈ భావప్రాప్తికి మూలం మెదడు. కనుక ఆ సమయంలో యోని ఎలా ఉంది అనే అంశం ప్రధానం కాదు. రతి తారాస్థాయికి వెళ్లినప్పుడు మెదడుకు సంకేతాలు అందుతాయి. మెదడు స్పందనతో భావప్రాప్తి దానంతట అదే జరిగిపోతుంది. కనుక సెక్స్ చేసే సమయంలో స్త్రీ తృప్తి చెందిందా.. లేదా..? అని తెలుసుకోవాలనుకోవడం అనవసరం.

=============================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail