Your Name : Your Email :

Health problem :

Thursday, February 16, 2012

భయం ఆందోళన టెన్షన్‌ తో అంగస్తంభనం జరగదా?

Q : ఈ మధ్య ఒకమ్మాయితో వివాహం నిశ్చయమయింది. పెళ్లికి ముందుగానే ఏకాంతంగా కలుసుకున్నాము. ఆ సమయంలో ఆమెను గట్టిగా హత్తుకుని... ముద్దుపెట్టుకున్నాను. అంగం గట్టిపడకుండానే వీర్యం పడిపోయింది. మరో సందర్భంలో ఆమెతో సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఎంతగా ప్రయత్నించినా అంగం గట్టిపడలేదు. నేను చాలా సంవత్సరాల నుండి హస్తప్రయోగం చేస్తున్నాను. సెక్స్‌ స్పందనలు కలగనప్పటికీ ఒక్కొక్కసారి నాకుగా నేనే ఊహించుకుని... ప్రేరేపించి మరీ హస్తప్రయోగం చేసుకునేవాడిని. పెళ్లికి ముహూర్తం నిశ్చయించారు. నేను మాత్రం ఇప్పట్లో పెళ్లి వద్దు అంటున్నాను. ఏదైనా పరిష్కారమార్గం సూచించి నా జీవితాన్ని సరైన మార్గంలో నిలబెట్టమని మనవి.

A : -భయం, ఆందోళన, ఒత్తిడి ఉన్నప్పుడు మెదడు స్తంభించి శృంగారనాడులు... శృంగార ప్రేరణలను లైంగికావయవాలకు చేరవేయదు. పురుష శృంగార హార్మోన్లు పూర్తిస్థాయిలో విడుదల కావు. కనుక భయం, ఆందోళన, ఒత్తిడి ఉన్నప్పుడు శృంగారం చేయకపోవడమే మంచిది. మీకు నిజానికి ఏ సమస్యా లేదు. అంగస్థంభన సమస్యగానీ, శీఘ్రస్కలనంగానీ లేవు.కేవలం పెళ్లికి ముందు ఆదుర్దాగా...భయంతో ఎవరైనా చూస్తారేమో అన్న ఆందోళనతో స్ట్రెస్‌ లేక టెన్షన్‌తో శృంగారంలో పాల్గొనే ప్రయత్నం చేసినపుడు రక్తప్రసరణలోపం ఏర్పడి అంగస్తంభనం జరగదు. అయినా వివాహపూర్వ సంబంధాలతో ఇటువంటి అనర్ధాలే వస్తాయి. ఒకసారి మీరిద్దరూ సెక్సాలజిస్ట్‌ను కలిసి కౌన్సిలింగ్‌ తీసుకోండి. అంతేగానీ లేనిపోని భయాందోళనలతో డిప్రెషన్‌కు గురికాకండి. ప్రశాంతంగా ఉండండి.


  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail