Your Name : Your Email :

Health problem :

Wednesday, February 15, 2012

గర్భిణీ లో అతిగా వాంతులు ఎందుకు?

Q : ఒక్కొక్క స్ర్తీకి నెల తప్పిన నుండి డెలివరి అయ్యేవరకు ఏ ఆహారం తీసుకున్నా వాంతులు అవుతున్నాయి, ఆ స్ర్తీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది? తల్లి తీసుకునే ఆహారం, గాలి మీదనే ఆధారపడి ఉన్న స్ర్తీ గర్భంలోని శిశువు గతి ఏమీ కావాలి? ఇలాంటి స్ర్తీలు చాలా అరుదుగా ఉంటారు. డెలివరి అయ్యే వరకూ వాంతులు అవటానికి ముఖ్యమైన కారణం ఏమిటి? ఇలాంటి స్ర్తీలకు మీరిచ్చే సలహా ఏమిటో చెప్పగలరు.

A : మామూలుకంటే ఎక్కువగా వాంతులై, తిన్నదేది ఇమడకపోతే ఆది ప్రమాదమే! అలాంటి పేషెంటును పూర్తిగా డాక్టరు సంరక్షణలోనే ఉంచాలి. పెద్ద హాస్పిటల్లో ఉంచటం మంచిది. గర్భం ధరించిన వెంటనేకాని కొద్దివారాల్లోకాని ఆడవాళ్ళందరికీ కడుపులో త్రిప్పుట, వాంతులు మొదలవుతాయి. పొద్దుటవేళ త్రిప్పటం ఎక్కువగా ఉంటుంది. తిన్నదంతా కక్కేసుకోవటం జరగదు. ఇది మామూలు ఆడవాళ్ళ సంగతి.
కొందరికి మీరు చెప్పిన పేషెంటులా - పరిస్థితి ఇంకా తీవ్రంగా ఉంటుంది. మంచినీళ్ళు తాగినా వాంతి అయిపోతుంది. కనుక డిహైడ్రేషన్‌, కాళ్ళు తేలిపోవటం, బరువు కోల్పోవటం జరుగుతాయి. అలా ఎందుకు జరుగుతుందీ అంటే ఒక్కొక్కరూ ఒకొక్కలా చెబుతున్నారు. మొత్తంమీద గర్భం ధరించటం వల్ల ఒంట్లో సంభవించే అనేక రకాల రసాయనిక మార్పులకి శరీరం ఎడ్జస్టు కాలేకపోతోందనీ, అందుకు వాంతులు కలుగుతున్నాయనీ చెప్పుకోవచ్చు. న్యూరోసిస్‌(నరాల బలహీనత) ఉన్న స్ర్తీలే ఎక్కువడా దీనికి లోనవుతున్నారు.

జీర్ణకోశ సంబంధమైన వ్యాధులు, కొన్ని అంటురోగాలూ, మెదడుకి, మెదడు పొరలకి సోకిన వ్యాధూలు కూడా ఈ పరిస్థితి తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అతివమనానికి క్లోర్‌ప్రామజైన్‌, ఇతర ఏంటీ హిస్టమైన్‌లు బాగానే పనిచేస్తాయి. కొవ్వు ఎక్కువగా ఉండే పదార్థాలు తగ్గించి కార్బో హైడ్రేట్లు ఎక్కువడా ఉండే దుంప పదార్థాలు, పళ్ళు, కూరలు తీసుకోవాలి. బార్లీజావ మంచిది. ఫ్రూట్‌జామ్‌, నిమ్మకాయ ఊరగాయ మంచివి. మలబద్ధkaM గర్భవతులకు సహజం కనుక దాని ప్రభావం కూడా కొంత ఉంటుంది. ఆ బాధ లేకుండా జాగ్రత్త పడాలి. అతివమనం మరీ ఎక్కువgaa ఉంటే ఉపశమనకారులు వా డవచ్చు. మందుల ప్రభావం బిడ్డ మీదుంటుంది సుమా. అందువల్ల స్వంత వైద్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరాదు. ఈ అతివమనం చికిత్సకి లొంగకుండా ఎక్కువకాలం కొనసాగితే ఆ స్ర్తీ శరీరంలోని పిండి పదార్థ నిల్లలూ, ఆపై కొవ్వు నిల్వలు కలిగిపోయి రక్తంలో విషపదార్థాలు చేరుతాయి.

ఆ స్ర్తీ గబగబా బరువు తగ్గిపోతుంది. చర్మమూ, ఎముకలూ తప్ప కండలేదనిపించేలా తయారవుతుంది. అంతదాకా రానివ్వ కూడదు. వచ్చిందా హాస్పిటల్లో చేరాల్సిందే. అక్కడ డాక్టర్లు అన్నం మాన్పించి రెండు రోజుల పాటు సెలైను, గ్లూకోజు ఎక్కిస్తారు. పేషెంటు వెంటనే కోలుకుంటుంది. అపైన పళ్ళ రసాలు బార్లీ జావ మొదలైన వాటితో మొదలుపెట్టి క్రమేణా మళ్ళీ ఆహారం లోకి దించుతారు. ప్రాణ ప్రమాద పరిస్థితే వస్తే ఆ గర్భాన్ని తొలగించైనా తల్లిప్రాణాన్ని కాపాడతారు. ఇంటి దగ్గర ఇవేవీ వీలుకావు.



  • =================================

No comments:

Post a Comment

Ask your health Question? with your e-mail