Your Name : Your Email :

Health problem :

Showing posts with label అంగపరిమాణం పెంచుకోవడానికి అవకాశం ఉందా?. Show all posts
Showing posts with label అంగపరిమాణం పెంచుకోవడానికి అవకాశం ఉందా?. Show all posts

Friday, October 28, 2011

అంగపరిమాణం పెంచుకోవడానికి అవకాశం ఉందా?, How to increase pennis size?

ప్ర : నా వయసు 21 సంవత్సరాలు. నా అంగం చిన్నగా ఉంటుంది. బీజా లు కూడా చిన్నవిగా ఉంటాయి. ఎ వరికీ చెప్పుకోలేక బాధపడుతున్నా ను. అంగస్తంభన, సెక్స్‌ కోరికలు సహజంగానే కలుగుతాయి. అంగపరిమాణం పెంచుకోవడానికి అవకాశం ఉందా?


జ : మీలో సెక్స్‌ కోరికలు, అంగస్తంభనలు అందరిలానే సహజంగా ఉన్నాయి కనుక కంగారు పడవలసిన అవసరం లేదు. స్తంభించని అంగం 2 నుంచి 3 అంగుళాల వరకు ఉండి స్తంభన సమయంలో మూడు నుంచి సుమారు ఏడు అంగుళాల మధ్య వరకూ పెరుగు తుంది. దీనికి కారణం అంగంలో రక్తం నిండుకోవడమే. అంగపరిమాణంలో ముఖ్యంగా అంగస్తంభన కలగడం, అంగప్రవేశం చేయడం, సెక్స్‌ కోరికలు కలగడం ముఖ్యం. అలానే బీజాలు మరీ పెద్దవిగా, మరీ చిన్నవిగానూ ఉండకూడదు. మీరు ఒకసారి హార్మోన్ల పరీక్షలు చేయించుకోండి.

వీర్యకణాల సంఖ్య, కదలికలకు సంబంధించిన పరీక్షలు చేయిం చుకున్నట్లయితే కొంతవరకూ సమస్యలు తీరవచ్చు. అలాగే అంగపరిమాణం పెంచే శస్తచ్రికిత్సలు ఫ్రాన్స్‌, అమెరికా వంటి దేశాలలో అంతగా ఫలితాన్ని చూపించడంలేదు. పైగా దుష్ఫలితాలే ఎక్కువ.  అంగం ముందుభాగానికి కోతపెట్టి అక్కడ కొవ్వును నింపడం తప్ప రక్తనాళాలలో అంగస్తంభన సమయంలో రక్తాన్ని నింపుకునే సైనస్‌లను కలిగివుండే కార్పొరా కావర్నికా, కార్పొరా స్పాన్సిశామ్‌లను పొడవుగా మాత్రం చేయలేము. నకిలీ సెక్స్‌ క్లీనిక్‌లో మాత్రలు, సెక్స్‌ డివైజెస్‌, పంపింగ్‌ మెషీన్స్‌ ఉపయోగిస్తూ మగవారి బలహీనత ను క్యాష్‌ చేసుకుంటున్నారు. అంగపరిమాణం పెంచుకోవడంకన్నా ముందు అంగప్రవేశం చేసేముందు స్ర్తీని ఫోర్‌ప్లే ప్రక్రియ ద్వారా తృప్తిపరచవచ్చు.అందరి అంగపరిమాణాలు ఒకేలా ఉండవని స్త్రీలు గ్రహించాలి.


  • =============================================