Your Name : Your Email :

Health problem :

Showing posts with label కలయిక సౌకర్యంగా సాగేందుకు మార్గాలు. Show all posts
Showing posts with label కలయిక సౌకర్యంగా సాగేందుకు మార్గాలు. Show all posts

Saturday, October 8, 2011

కలయిక సౌకర్యంగా సాగేందుకు మార్గాలు

Q : నా వయసు ఇరవైఆరు. నాలుగేళ్ల క్రితం పెళ్లయ్యింది. ఒక బాబు. లైంగిక జీవితానికి సంబంధించి నాకెలాంటి సమస్యలు లేవు. కలయిక సౌకర్యంగా సాగేందుకు కొన్నిసార్లు స్రావాలు సరిగ్గా విడుదల కావడంలేదని ఈ మధ్య నా భర్త అంటున్నారు. తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నాకు మాత్రం కలయిక సంతృప్తికరంగానే అనిపిస్తోంది. ఇలాంటి సమస్యలు కూడా ఎదురవుతాయా? దీనికి పరిష్కారం లేదంటారా? A : కలయిక సౌకర్యంగా.. సంతోషకరంగా సాగేందుకు స్రావాలు విడుదలవుతాయి. దానివల్ల నొప్పి వంటి సమస్యలు ఎదురుకాకుండా ఉంటాయి. అయితే ఈ స్రావాలు కొన్ని సమయాల్లో ఎక్కువగా విడుదల కావచ్చు. మరికొన్నిసార్లు తక్కువగా లేదా అసలు కాకపోవచ్చు. రుతుచక్రం.. లైంగికజీవితంపై ఆసక్తి తగ్గడం, తీవ్రమైన ఒత్తిడి, కొన్నిరకాల జననేంద్రియాల ఇన్‌ఫెక్షన్లు వంటివి ఈ సమస్యకు కారణం కావచ్చు. ఈ సమస్యకు పెద్దపెద్ద చికిత్సలు అవసరంలేదు. కలయిక వల్ల మీరు పొందుతున్న అనుభూతిని మీ భాగస్వామికి తెలియజేయండి. ఇద్దరూ ఎక్కువ సమయం కలిసి గడపడం, సంతృప్తి కలుగుతున్నా.. లైంగిక ఆసక్తిని మరింత పెంచేందుకు అలాంటి పుస్తకాలను చదవడం.. ఆ జీవితాన్ని ఊహించుకోవడం.. వంటివన్నీ స్రావాలు ఎక్కువ విడుదలయ్యేందుకు చక్కని మార్గాలు. కాబట్టి ముందు మీ భర్తతో మాట్లాడండి. తప్పకుండా అర్థం చేసుకుంటారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ ఉండొచ్చని సందేహిస్తే మాత్రం ఆలస్యం చేయకుండా వైద్యుల్ని సంప్రదించండి. అవసరాన్ని బట్టి మీరిద్దరూ మందులు వాడితే సమస్య అదుపులోకి వచ్చేస్తుంది. మరీ తప్పనిసరనిపిస్తే.. నిపుణుల సలహాతో ల్యూబ్రికెంట్లు ఎంచుకునే ప్రయత్నం చేయండి. Apply VASOCARE vaseline to penis before sexual act.