Your Name : Your Email :

Health problem :

Showing posts with label wants more sex. Show all posts
Showing posts with label wants more sex. Show all posts

Thursday, December 22, 2011

భార్యతో రోజూ 5, 10 నిముషాలు రతి జరిపినా ఆమె ఇంకా కావాలంటుంది

Q : నేను 2 సంలు క్రితం సౌదీకి పోయినాను. వెళ్ళే ముందు రోజు బొంబాయిలో ఒక వేశ్య ను కలిసినాను. సౌదీకి వెళ్ళిన 4 రోజులకి నా అంగం చినిగినట్టయి కురుపులు అయినాయి. రోజూ సబ్బుతో కడకగా 6,7 నెలలకు మొత్తం తగ్గింది. కానీ అప్పటినుంచి ఎండలో పోయినా, ఎండాకాలం వచ్చినా మూత్రం మండుతుంటుంది. వర్షాకాలంలో ఉండదు. దీనికి కారణం అప్పటి జబ్బేనా? అదేమి జబ్బు? నేను భార్యతో రోజూ 5, 10 నిముషాలు రతి జరిపినా ఆమె ఇంకా కావాలంటుంది. ఎలా? రెండవసారి చేద్దామంటే సాధ్యం కావటం లేదు.

A : సుఖవ్యాధుల్ని అలా ఎన్నడూ ఉపేక్షించకూడదండీ. వెంటనే ట్రీట్‌మెంట్‌ తీసుకోకపోతే అవి క్రానిక్‌ ( ముదురు) అయి పోతాయి. ప్రస్తుతం మీకున్న మూత్రం మంట వ్యాధి సంబంధమో కాదో పరీక్ష చేయించుకుంటేనే తెలుస్తుంది. వ్యాధి సంబంధమైనదైతే డాక్టరు వెంటనే చికిత్స చేస్తారు. ఎండాకాలంలో మంచినీ ళ్ళు ఎక్కువగా తీసుకుంటే మూత్రం మంట పెట్టదు. మీ భార్యకి రతిలో భావప్రాప్తి కలగనందున ఆమె ఇంకా కాస్సేపు కావాలని కోరుతున్నట్టున్నారు. అందుకు తగ్గట్టుగా రతి భంగిమ మార్చుకోండి. ఉపరతిలో ఎక్కువమంది స్ర్తీలు తేలిగ్గా భావప్రాప్తి పొందుతారు. మరిన్ని భంగిమలు, స్ర్తీలు తృప్తిపడేందుకు అనువైన విధానాలు ప్రణయకళ, వాత్స్యాయన కామసూత్రాలు తెలుసుకోవాలి. మానసికంగా ఆమెకు సంతోషం కలిగించడం మరింత ముఖ్యం. భావప్రాప్తి పొందని స్త్రీలు ఉంటారు కాని అలా 10 నిముషాలు రతి తరువాత ఇంకా కావాలనేవారుండరు .


  • =============================