Your Name : Your Email :

Health problem :

Showing posts with label Only in 3 min.finishes the meet-కేవలం మూడు నిమిషాల్లో కలయికను ముగించేస్తారు. Show all posts
Showing posts with label Only in 3 min.finishes the meet-కేవలం మూడు నిమిషాల్లో కలయికను ముగించేస్తారు. Show all posts

Thursday, January 2, 2014

Only in 3 min.finishes the meet, కేవలం మూడు నిమిషాల్లో కలయికను ముగించేస్తారు



  •  

Q : * ఆరేళ్ల నుంచీ మా వారి తీరుతో అసౌకర్యంగా ఉంటోంది. కేవలం మూడు నిమిషాల్లో కలయికను ముగించేస్తారు. నా మనసుని అర్థం చేసుకుని, ఇంకొంచెం సేపు కొనసాగించరు. అంత తక్కువ సమయంలో కలయికను ముగిస్తున్నారంటే, ఆయనలో ఏదయినా లోపం ఉందేమోనని అనిపిస్తోంది. ఈ కారణంగా పేరుకున్న అసంతృప్తీ, మాటలతో... మా మధ్య గొడవలవుతున్నాయి కూడా. సాధారణంగా లైంగికచర్య ఎంతసేపు ఉండాలి?--- ఓ సోదరి

Ana : లైంగికచర్య ఎంతసేపు ఉండాలనేది వ్యక్తుల్ని బట్టి ఉంటుంది. అందరూ ఒకే సమయం తీసుకుంటారని చెప్పలేం. కొందరు ఎక్కువసేపు కొనసాగిస్తే, మరికొందరు చాలా తక్కువ సమయంలోనే ముగిస్తారు. మీ వారి విషయంలో అదే జరుగుతోంది. కొన్నిసార్లు ఒత్తిడీ, అలసట వల్ల అలా కావచ్చు. అయితే, కలయికలో పాల్గొన్న తరవాత రెండు నిమిషాల్లో చివరి దశకు చేరుకుంటారని చాలా అధ్యయనాలు స్పష్టం చేశాయి. దీన్నిబట్టి చూస్తే మీ వారు, ఇతర మగవాళ్ల కన్నా కలయికలో ఎక్కువ సమయం చురుగ్గా ఉంటున్నట్టే!

మీరు కోరుకున్నట్లు లైంగిక చర్యను ఎక్కువసేపు కొనసాగించాలంటే ఫోర్‌ప్లే ఎక్కువసేపు ఉండాలి. అయితే చాలామంది మగవాళ్లు దానిని తేలిగ్గా తీసుకుని... కేవలం లైంగికచర్యకే ప్రాధాన్యమిస్తారు. మాటలూ, చేతలతో వాంఛను పెంచే ఫోర్‌ప్లే వల్ల ఉత్సాహం పెరుగుతుంది. లైంగిక చర్యకు శరీరం అనుకూలంగా మారుతుంది. కలయిక సమయంలో చురుగ్గా ఉండి, ఎక్కువసేపు కొనసాగించే అవకాశమూ ఉంటుంది. కాబట్టి మీరిద్దరూ అలాంటి పద్ధతుల్ని పాటించేందుకు ప్రయత్నించండి. ఈ విషయాలను మీరు తనతో ప్రస్తావించగలిగితే మంచిదే. లేని పక్షంలో నిపుణుల్ని కలిస్తే వారు తగిన సూచనలు చేస్తారు. మీ భర్తలో కొంతవరకూ మార్పు వచ్చే అవకాశం ఉంది.

Courtesy with : Dr.Sharmila Majundar@eenadu vasundhara 04-Oct.2013

  • =================================
 Visit my website - Dr.seshagirirao.com