Your Name : Your Email :

Health problem :

Showing posts with label Having daily desire- రోజూ కావాలనిపిస్తోంది. Show all posts
Showing posts with label Having daily desire- రోజూ కావాలనిపిస్తోంది. Show all posts

Wednesday, October 26, 2011

రోజూ కావాలనిపిస్తోంది, Having daily desire



Q : నిత్యం సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటా రని, ఇంకా మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, గుండె సంబంధిత జబ్బులు సైతం దరిచేరవని విన్నాను. 65 సంవత్సరాలు దాటినవారు కూ డా రోజూ సెక్స్‌లో పాల్గొంటే ఆరోగ్యంగా ఉం టారని విన్నాను. మా పెళ్లయి 15 సంవత్స రాలు. ఇద్దరు పిల్లలు. నా భార్యకు 42 సంవ త్సరాలు. ఆమెకు రతిపట్ల ఆసక్తి కలగడం లేదు. ఆమె పెళ్లయిన పది సంవత్సరాల దాకా బాగానే సహకరించింది. అయితే ఈ మధ్య ఎందుకో అనాసక్తి ప్రదర్శిస్తోంది. నాకు రోజూ సెక్స్‌ కావాలని ఉంటుంది. ఆమెలో ఉత్తేజం కలిగించడానికి ఏమైనా మందులు ఉన్నా యా? తెలపగలరు.




A : ముందుగా మీరు మీ భార్య ఎందుకు అలా ఫ్రిజిడిటీగా మారిందో తెలుసుకోవాలి. ఆమె ప్రిమోనోపాసల్‌ స్టేజీలోకి వెళుతున్నారా... పీరియడ్స్‌ రెగ్యులర్‌గా ఉన్నాయా? మీ ప్రవ ర్తన ఆమెలో అసహనం కలిగిస్తోందా? ఆమె ను అగౌరవపరిచే విధంగా ఉంటోందా? ముందు మీ ఇద్దరి సంబంధబాంధవ్యాలు ఎలా ఉన్నాయి? లేక మీలోనే ఏదైనా అంగ స్థంభన లోపం గానీ, శీఘ్రస్కలనలోపం కానీ ఉండి మీ భార్యను సంతృప్తిపరచలేకపోతు న్నారా? ఎందుకు ఆమె మిమ్మల్ని తిరస్కరి స్తోంది. ఇవన్నీ తరచిచూడాలి. ముందు మీరు మంచి సెక్సాలజిస్ట్‌ను మీ భార్యతో కలవండి. ఇద్దరిలో ఆసక్తి... ఆరోగ్యం ఉంటే రోజూ సెక్స్‌లో పాల్గొనడం ఆరోగ్యరీత్యా మంచిదే.


  • =============================================