Your Name : Your Email :

Health problem :

Showing posts with label Stains to fant Trouser-ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది.. Show all posts
Showing posts with label Stains to fant Trouser-ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది.. Show all posts

Monday, December 17, 2012

Stains to fant Trouser-ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది

 ప్రశ్న : నేను ఇంటర్మీడియట్‌ చదువుకుంటున్నాను. ఇంటికి వచ్చిన తరువాత నా ప్యాంటికీ మరక అంటుకుని వుంటోంది. అది లేత పసుపు రంగులో వుంది. తరుచూ ఇలా జరగడం వల్ల నాకు చాలా ఆందోళనగా వుంది. నా ప్యాంటిలోని వాషింగ్‌ మిషన్‌లోవేసేటపుడు మమ్మీ చూసి ఏమంటుందోనని కంగారుగా వుంది. ఈ మరకలు అంటకుండా వుండాలంటే ఏం చేయాలి? (ఒక అమ్మాయి)

జవాబు : టీనేజిలో ఇలా ప్యాంటీలకు మరక అంటుకోవడం ఒక సహజమైన పరిణామం. వయసులో వున్నప్పుడు కామ స్రావాలు ఊరుతాయి. సెక్స్‌ ఆలోచనలు కలిగినపుడు లేదా మగవాళ్లను చూసినపుడు స్పందనలు ఏర్పడి, తత్ఫలితంగా అక్కడ చెమ్మ ఏర్పడుతుంది. ఇది శారీరక ఆరోగ్య స్థితిని బట్టి లేత పసుపు రంగు నుంచి, ముదురు పసుపు వరకు మరకగా ప్యాంటికి అంటుకుంటుంది. ఇది జబ్బూ కాదు. నీవు తప్పు చేస్తున్నట్టు కాదు. ఈ మరకను మీ అమ్మగారు చూస్తే ఏమవుతుందోనని ఆందోళన చెందనవసరం లేదు. ఒక తల్లిగా ఆమెకు ఈ విషయం పట్ల అవగాహన వుండే వుంటుంది. కాబట్టి దిగులు పడనక్కర్లేదు. నిజానికి ఇటువంటి విషయాల్లో సందేహం వచ్చినపుడు నీకు అన్నివిధాలా స్నేహపూర్వకంగా వుండేది మీ అమ్మగారే. ఒకవేళ మీ అమ్మగారికి ఇటువంటి విషయాల్లో అవగాహన లేకపోవడమో లేక ఆమె మరీ చాంధసురాలు కావడమో జరిగినట్టయితే అందుకు తగిన అవగాహన కల్పించే సమాచారం ఆమెకు అందివ్వాల్సి వుంటుంది. అనవసర భయాలను వదిలిపెట్టి మీ అమ్మగారితో ఓపెన్‌గా వుండడం అలవర్చుకో.

Courtesy with : హిప్నో కమలాకర్‌-సెక్స్‌ థెరపిస్ట్‌ & సైకాలజిస్ట్‌@ ఆంధ్రపభ ఆదివారము అనుబంధము .
  •  =========================