A : మీ పరిస్థితిని లాక్స్‌వాజినా అంటారు. ఇది కొద్దిమంది స్ర్తీలలో 8, 9 కాన్పుల అనంతరం జరుగుతుంటుంది. అయితే ఇద్దరు పిల్లల తర్వాత వచ్చే అవకాశమే లేదు. సెక్స్ సమయంలో స్ర్తీపురుషులిద్దరిలో వెజైనల్ ద్వారాలు, ప్రీ వెజుక్యులేటరీ సీక్రెషన్స్ ఉద్రేకం వలన వెజైనల్‌లోని పురుషాంగంమీద స్రవిస్తాయి. సెక్స్‌ప్రక్రియ మధ్య లో మంచి ఉతికిన కాటన్ గుడ్డతో ఇరువురు తుడుచుకోవాలి. అలాగే మీవారిని ఫోర్‌ప్లే ఎ క్కువసేపు చెయ్యమనండి. దానివలన వెజైనల్ బయట ముప్పావు వంతు కండరాలు తేలిక అవుతాయి. అలాగే కొన్నిరకాల బ్రీథింగ్ ఎక్సరసైజ్‌లు, పిసిఎమ్ ఎక్సరసైజెస్ వలన కూడా వెజైనల్ ద్వారం టైట్ అయ్యే అవకాశం ఉంటుంది.
మీవారిని ముందు మిమ్మల్ని సతా యించడం మాని మీకు సహకరించమని చెప్పండి. స్ర్తీలలోనే కాక పురుషులలో కూడా అంగస్తంభనం, శీఘ్రస్కలనాలు, భార్యలతో ఫోర్‌ప్లే చేయకుండా శృంగారంలో దిగి అసంతృప్తికి లోనవడం లాంటి సమస్యలు 99 శా తం ఉంటున్నాయి. అయితే భర్త ఎక్కడ ఫీల్ అవుతాడోనని కొందరు భావప్రాప్తి కలిగినట్లు నటిస్తారు. మీ వారిని పైన చెప్పినట్లుగా ఫోర్‌ప్లే టెక్నిక్స్ పాటించమని చెప్పండి. అప్పటికీ ఫలితం లేకపోతే ఇద్దరూ కలసి ఎవరైనా మంచి సెక్సాలజిస్ట్‌ను కలిస్తే కొన్నిరకాల ఎక్సరసైజ్‌లను సూచించడంగానీ, కౌన్సెలింగ్ గానీ చేస్తారు.
- ==================================