జ : మీరు అనవసరంగా ఆందోళనపడవలసిన అవసరం లేదు. ఎటువంటి మందులు మీరు వాడనవసరంలేదు. హస్తప్రయోగం వలన ఎటువంటి అనర్థాలు, తేడాలు రావు. దాని వలన సెక్స్ సామర్థ్యం తగ్గదు. మీరు వివాహ జీవితానికి అందరిలానే అర్హులు. మానసిక చింత, లేనిపోని అనుమానాలు లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. మీరు వివా హానికి మీరు అన్నిరకాలుగా యోగ్యులు. అంగం పొడవు పైన సెక్స్ సామర్ధ్యము ఆధారపడి ఉండదు . అంగము గట్టిపడి స్ట్రోక్ ఎంత శక్తితో ఇస్తున్నారన్నదే ముఖ్యము . పురుషాంగము గట్టిపడి 2 అంగుళాలు పొడవు ఉంటే చాలు . స్త్రే సంతృప్తిపడే వరకూ గట్టిపడి ఉంటే మగతనము బాగున్నట్లే.
సెక్స్ సామర్ధ్యము పెంచుకోవడానికి మాత్రలు ఉన్నాయి . కాని అనారోగ్యానికి దారితీస్తాయి. వాడవద్దు . మంచి ఆహారము , నిద్ర ఉంటే ఏమాత్రలు వాడనవసరమూ ఉండదు . సెక్స్ సామర్ధ్యము అందరికీ ఒకేలా ఉండదు . కొంచం తేడాలు ఉంటాయి. దానికోసం అందోళన అవసరము లేదు .
- =============================================